పురాతన కాలం నుంచి భారతీయుల్లో పలు అంశాల పట్ల విశ్వాసాలు ఉన్నాయి. అది అలా చేయకూడదు, ఇది ఇలా చేయాలి, అక్కడ అలా ఉండకూదు, ఇది ఆ సమయంలో తినకూడదు, అలా చేయాలి, ఇది చేయకూడదు.. ఈ విధంగా అనేక అంశాల పట్ల ఆయా వర్గాల ప్రజలు తమ విశ్వాసాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అలాంటి విశ్వాసాలను కొందరు మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తారు. కొందరు బాగా నమ్ముతారు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాదాపుగా అలాంటి విషయమే.
ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడకూడదని సైన్స్ కూడా చెబుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ఉపయోగించే కొన్ని వస్తువులను మాత్రం ఇతరులకు ఇవ్వకూడదట. మనం కూడా ఇతరులకు చెందిన ఆ వస్తువులను వాడకూడదట. లేదంటే అనేక సమస్యలు వస్తాయట. ఇంతకీ మనం వాడకూడని ఇతరులకు చెందిన ఆ వస్తువులేమిటో తెలుసా..? తెలుసుకుందాం రండి.
మంచం.. అవును. మనం ఇతరుల మంచంపై పడుకోకూడదట. అలాగే ఇతరుల మంచంపై నిద్రించకూడదట. లేదంటే వారిలోని వైబ్రేషన్స్ మనకు వస్తాయట. ఆ క్రమంలో మనకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయట. అంతేకాదు ఆరోగ్యం కూడా బాగుండదట. కనుక ఇతరుల మంచాలపై నిద్రించరాదు. ఇక సాధారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా బంధువుల్లో మనం మన శరీరానికి తగినట్టుగా ఉండే ఇతరుల దుస్తులను ఎక్కువగా ధరిస్తాం. అయితే అలా ఒకరి దుస్తులను మరొకరు ధరించకూడదట. అలా చేస్తే జీవితంలో అన్నీ సమస్యలే ఎదురవుతాయట.
ఇతరుల డబ్బుపై ఎప్పుడూ కన్నేసి ఉండే వారికి ఎప్పుడూ దురదృష్టమే వస్తుందట. అందుకే మనం మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తి ఉండాలట. ఇతరులకు ఉన్న దాని గురించి మనం ఆలోచించకూడదట. అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా వెంటనే రుణ భారం తీర్చేసుకోవాలట. ఒకరి వద్ద ఉన్న పెన్నును మరొకరు తీసుకుని వాడడం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా బ్యాంకుల్లో ఇలా ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇలా ఒకరి పెన్ను తీసుకుని వాడితే ఆర్థిక సమస్యలు కలుగుతాయట. అందుకని అలా కూడా చేయకూడదు. అలాగే ఇతరుల రిస్ట్ వాచీలను అస్సలు ధరించకూడదట. అలా ధరిస్తే వారిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మనకు వస్తుందట. దీంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా వస్తాయట. కనుక ఇతరు వాచ్‌లను మనం ధరించరాదు. ఇలా ఇతరులు వాడే పలు వస్తువులను మనం అసలు ఎన్నటికీ వాడకూడదు. వాడితే అన్నీ సమస్యలే వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.