Watermelon Cutting : వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పుచ్చకాయలు. ఇవి మనకు ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. పైగా ఇప్పుడే ఇవి ధర తక్కువగా ఉంటాయి. కనుక వేసవిలో వీటిని చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే పుచ్చకాయలను కొని తేవడం వరకు బాగానే ఉంటుంది. కానీ వాటిని కోయాలంటేనే వెనుకడుగు వేస్తుంటారు. వాటిని సరిగ్గా ఎలా కోయాలో చాలా మందికి తెలియదు. ఎలా కోసినా వాటిల్లో వచ్చే విత్తనాలను తీసేందుకు కష్టపడాల్సి వస్తుంది. అయితే కింద ఇచ్చిన ఓ వీడియోను చూస్తే మీరు కేవలం 2 నిమిషాల్లోనే పుచ్చకాయను అవలీలగా కోసేస్తారు. పైగా విత్తనాలు కూడా రావు. మరి ఆ వీడియోపై ఓ లుక్కేద్దామా..!
వీడియోను చూశారు కదా. అందులో ఓ వ్యక్తి పుచ్చకాయను ఎలా కోస్తున్నాడో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇది. ముందుగా కాయను అడ్డంగా కోయకుండా దాని మీద ఉన్న తొక్కను తీసేశాడు. తరువాత అడ్డంగా ముక్కలుగా కట్ చేశారు. అనంతరం వాటిని చిన్న ముక్కలుగా చేశాడు. దీంతో పుచ్చకాయ ముక్కలు రెడీ అయ్యాయి. ఇలా సులభంగా ఎవరైనా సరే పుచ్చకాయలను కట్ చేయవచ్చు. ఇలా చేస్తే విత్తనాలు దాదాపుగా పోతాయి.
ఇక పుచ్చకాయ విత్తనాలను చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ కాయతో సహా మనం విత్తనాలను కూడా తినవచ్చు. పుచ్చకాయలతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వాటి విత్తనాలతోనూ మనకు అలాంటి ప్రయోజనాలే కలుగుతాయి. కనుక ఈసారి పుచ్చకాయను కోస్తే పై విధంగా ఓసారి ప్రయత్నించండి. కానీ విత్తనాలను తినడం మాత్రం మరిచిపోకండి..!