ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది సంతోషకరమైన శుభకార్యం, అలాంటి క్షణాలు మళ్లీ రావు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. దానిలో పెళ్లికూతురు తాళి కట్టే సమయానికి ముందు పెళ్లి వద్దు అని నిరాకరించింది. ఈ వీడియోలో పెళ్ళికొడుకు మరియు కుటుంబ సభ్యులందరూ స్టేజ్ పైన ఉండగా పెళ్ళికొడుకు తాళి కడుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో సార్లు ప్రయత్నించి కుటుంబ సభ్యులు అడిగినా సరే పెళ్లికూతురు తాళి కట్టించుకోవడానికి నిరాకరించింది.
దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా పెళ్లికూతురు ఇంకా చదువుకుంటాను, నేను పెళ్లికి రెడీగా లేను అని సమాధానం ఇచ్చింది. పెళ్ళికొడుకు మరియు వారి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నించారు కాకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. దీంతో ఇద్దరి కుటుంబాల మధ్య గొడవలు జరిగి పెళ్లి ఆగిపోయింది.
ఈ వైరల్ వీడియోని చూసిన నేటిజన్స్ ఆ పెళ్లికూతురి ధైర్యానికి పొగుడుతున్నారు. మరికొందరు అయితే పెళ్లి ఫిక్స్ చేయక ముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అంటున్నారు. ఈ విధంగా పెళ్లికూతురు నిరాకరించడంతో పెళ్లికొడుకు షాక్ కి గురయ్యాడు. వేరే దారి లేక పెళ్లికూతురు నిరాకరించడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.