viral news

రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..

రైలు ప్రయాణాల్లో చోటు చేసుకునే అనేక రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. జనరల్ బోగీల్లో చాలా వరకూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. అయితే టీసీ చెకింగ్‌కు వచ్చిన సందర్భాల్లో ఏవేవో సాకులు తెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో టీసీ అడిగిన ప్రశ్నకు ఓ యువకుడు వింత సమాధానం ఇచ్చాడు. వీరి వాగ్వాదానికి సబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్లో ఉన్నట్టుండి ఓ టీసీ టికెట్ చెకింగ్‌కు వస్తాడు. అందరి టికెట్లను పరిశీతిస్తుండగా.. అక్కడే ఉన్న ఓ యువకుడు కంటపడతాడు. అతడి టికెట్‌ను కూడా అడిగి, చివరకు ఒరిజినల్ ఐడీ కార్డ్ చూపించమంటాడు. ఇందుకు ఆ యువకుడు ఫోన్‌ వాట్సప్‌లోని ఐడీ కార్డ్ ఫొటోను చూపిస్తాడు.

train tc with boy video viral

అయితే యువకుడికి టీసీ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం రూల్స్ మారాయి.. డిజి లాకర్, ఒరిజినల్ కాపీని మాత్రమే పరిగణన‌లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది’.. అని యువకుడితో అంటాడు. ఒరిజినల్ కాపీ తన వద్ద లేదని, వాట్సప్‌లోని ఇమేజ్‌ని పరిగణన‌లోకి తీసుకోవాలంటూ టీసీతో వాగ్వాదానికి దిగుతాడు. అలా కుదరదని తేల్చిచెప్పిన టీసీ.. వచ్చే స్టేషన్‌లో దిగాలంటూ అతడికి సూచిస్తాడు. అయినా యువకుడు ఏమాత్రం వెనక్కుతగ్గకుండా టీసీతో వాగ్వాదం చేస్తుంటాడు.

వారిద్దరి వాగ్వాదంతో పక్కన ఉన్న ప్రయాణికులంతా అలాగే చూస్తుండిపోతారు. ఇలా వారిద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరుగుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. టికెట్‌తో పాటూ ఐడీ కార్డు కూడా తీసుకెళ్లాలి.. అంటూ కొందరు, రైలు ప్రయాణాల్లో ఒరిజినల్ ఐడీ కార్డులను తీసుకెళ్లడం ఎలా సాధ్యం.. ఒకవేళ అవి చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు.. ఈ విషయంలో నిబంధనలు సడలించాలి.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Admin

Recent Posts