దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త జననాంగాన్ని కట్ చేసింది. ఆమె పరారీలో ఉంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ఢిల్లీలో నివాసం ఉండే ఓ భార్య భర్త మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య తన భర్త జననాంగాన్ని కట్ చేసింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయం గమనించిన స్థానికులు అతన్ని సమీపంలో ఉన్న సఫ్దార్జంగ్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు.
కాగా ఆ వ్యక్తికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతుండగా అతనికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సదరు మహిళ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాక పూర్తి వివరాలను తెలుసుకుంటామని అన్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.