viral news

Viral Video : వామ్మో.. ఏకంగా మొస‌లితో క‌లిసి ఈత కొట్టిందిగా.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

Viral Video : మొసలి ఎంత ప్రమాదకరమైనదో మ‌నంద‌రికి తెలిసిందే. నీటిలో రారాజులా తిరిగే ఈ మొసలి.. ఏ జంతువు కనిపించినా అమాంతంగా నమిలి మింగేయ‌న‌ది నిద్ర పోదు. అయితే, ఒక్కోసారి కొంద‌రు చిన్నారుల‌తో పాటు పెద్ద వాళ్లు కూడా మొస‌లితో ఆడిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. మొస‌లి మూతి పట్టుకుని మరీ నీటిలో జలాకాలాడారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధార‌ణంగా మొసళ్లు ఒకసారిని టార్గెట్ చేశాయంటే.. ఎవరైనా వాటికి ఆహారమవ్వాల్సిందే. అయితే అలాంటి భయంకరమైన మొసళ్లు కూడా కొన్నిసార్లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌మేస్తుంది.

ప్రస్తుతం విచిత్రమైన మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి భారీ మొసలితో స్నేహంగా ఉండడమే కాకుండా… దాంతో కలిసి ఈత కొట్టడం చూసి నెటిజన్లు అవాక్క‌వుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. బికినీ ధరించిన ఓ యువతి అందరికీ షాక్ ఇస్తోంది. ఈ యువతి సముంద్రంలో ఈత కొట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అందరిలా ఈత కొడితే విశేషం ఉండదు గానీ.. విచిత్రంగా భారీ మొసలితో కలిసి ఈత కొట్టడం మాత్రం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

woman swam with crocodile video viral

ఈత కొడుతూ నీటి అడుగుకు వెళ్లిన యువతి.. నీటిపై పాకుతున్న మొసలి వద్దకు వెళ్తుంది. వెళ్లడమే కాకుండా దగ్గరికి రెండు చేతులతో మొసలిని ప్రేమగా నిమురుతుంది. అస‌లు ఆమె మొఖంలో ఏమాత్రం భయం కనిపించిందు. అలాగే మొసలి కూడా ఆమెను ఏమీ అనకపోవడం ఆశ్చర్యం. ఇలా ఇద్దరూ కలిసి చాలా సేపు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇది చూసిన వారు ‘‘వామ్మో! ఇది మేము నమ్మలేకున్నాం’’.. అని అంటున్నారు. ఇలాంటి మొస‌ళ్లు మ‌న ద‌గ్గ‌ర కూడా ఉంటే బాగుండ‌ని చెబుతున్నారు.

Admin

Recent Posts