యోగా

Yoga For Neck Pain : మెడ‌నొప్పి ఇబ్బందుల‌కు గురిచేస్తుందా.. అయితే ఈ ఆస‌నాల‌ను వేయండి..!

Yoga For Neck Pain : చాలామంది, ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఉంటారు. యోగాసనాలు వేయడం వలన, ఫిట్ గా ఉండొచ్చు. ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అయితే, కొంతమందికి నొప్పులు ఉంటూ ఉంటాయి. మెడ నొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మీకు కూడా, మెడ నొప్పి అప్పుడప్పుడు వస్తోందా..? అయితే, ఇలా చేయండి. ఈ ఆసనాలతో మెడ నొప్పి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతం డెస్క్ జాబులు చేసే చాలా మందిలో, మెడనొప్పి సమస్య ఎక్కువగా ఉంటోంది. మెడ నొప్పి నుండి, ఉపశమనాన్ని పొందాలంటే, యోగాసనాలు వేస్తే మంచిది.

బిథిలాసనం లేదా మార్జారి ఆసనం వేస్తే ఫ్లెక్సిబిలిటీని పెంపొందించుకోవచ్చు. ఈ ఆసనం వేస్తే, బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది. పైగా నడుము, మెడ, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెడనొప్పి నుండి రిలీఫ్ కలుగుతుంది. అలానే, బాలాసనం వేస్తే కూడా, మెడ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. బాలాసనం వేస్తే, మెడ, భుజం కండరాలు స్ట్రిచ్ అవుతాయి. మెడ నొప్పి తగ్గిపోతుంది.

do these yoga asanas to get relief from neck pain

దీంతో, నొప్పి నుండి వెంటనే రిలీఫ్ కలుగుతుంది. మెడ, కండరాలు దృఢంగా మారడానికి సేతుబందాసనం వేస్తే మంచిది. ఈ ఆసనం వేయడం వలన, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మెడ దగ్గర గాయాలు ఉంటే, ఈ ఆసనాన్ని వేయకండి. మెడ నొప్పితో బాధపడే వాళ్ళు, సుఖాసనం వేస్తే కూడా, మెడ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా ఈజీ ఆసనం. ఈ ఆసనం వేస్తే, మెడ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మెడ నొప్పి నుండి తక్షణ ఉపశమనం సుఖాసనంతో కూడా పొందవచ్చు. ఉస్త్రాసన తో కూడా మెడ నొప్పి సమస్య తగ్గుతుంది. ఛాతి కండరాలు ఆరోగ్యంగా మారుతాయి. వెన్ను, మెడ ప్రాంతంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. గోముఖాసనం వేస్తే మెడ, భూజం, ఛాతి కండరాలు ఈజీగా స్ట్రెచ్ అవుతాయి. అధోముఖ శవాసనం వేస్తే మెడ కండరాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది.

Admin

Recent Posts