Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం.. ఎలా వేయాలో తెలుసా ?

గోముఖాస‌నం వేస్తే అనేక ర‌కాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ప‌లు భాగాలు దృఢంగా మారుతాయి.

Admin by Admin
September 20, 2021
in ఆరోగ్యం, యోగా
Share on FacebookShare on Twitter

యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనం వేయడం వల్ల భిన్న రకాల ఫలితాలు కలుగుతాయి. అయితే అందరూ రోజూ అన్ని ఆసనాలను వేయలేరు. కనుక తమకు ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి కొన్ని వ్యాయామాలను మాత్రం రోజూ చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలకు అనుగుణంగా యోగా ఆసనాలను కూడా వేస్తుంటారు. ఈ క్రమంలోనే అలా రోజూ వేయాల్సిన ముఖ్యమైన ఆసనాల్లో ఒక ఆసనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం.. ఎలా వేయాలో తెలుసా ?

నిత్యం వెన్ను నొప్పితో బాధపడుతున్నవారు, తొడలు, కండరాలు, కాళ్లు, నడుం నొప్పితో బాధపడుతున్నవారు, కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసేవారు రోజూ గోముఖాసనం వేయాలి. దీంతో అనేక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనాన్ని వేయడం కూడా చాలా సులభమే. అది ఎలాగంటే..

ముందుగా నేలపై పద్మాసనం వేసి కూర్చోవాలి. తరువాత కుడి కాలును మోకాలు వద్ద వంచి దాన్ని ఎడమ తొడ మీదుగా తీసుకురావాలి. తరువాత కుడి పాదం ఎడమ తొడ పక్కన వచ్చేట్లు పెట్టాలి. అలాగే ఎడమ కాలును మోకాలు వద్ద వంచి దాన్ని కుడి కాలు తొడ కిందుగా తీసుకెళ్లాలి. ఎడమ కాలి పాదం కుడి కాలి పిరుదు కింద వచ్చేలా చూసుకోవాలి.

వెన్నెముకను నిటారుగా ఉంచాలి. కుడిచేయిని పైకి లేపి భుజం నుంచి వెనక్కి తీసుకుని తల వెనకగా పెట్టాలి. ఎడమ చేయిని వెనక్కి తీసుకెళ్లి కుడి చేయి వేళ్లతో ఎడమ చేయి వేళ్లను పట్టుకోవాలి. ఇలా వీలైనంత సేపు ఉండాలి. తరువాత సాధారణ స్థితికి రావాలి.

అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం.. ఎలా వేయాలో తెలుసా ?

ఈ ఆసనాన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో చేయాలి. వీలైనన్ని సార్లు సౌకర్యానికి అనుగుణంగా చేయవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

గోముఖాసనం వేయడం వల్ల తొడ కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ల మడమలు, తొడలు, భుజాలు, చంకలు, ఛాతి భాగాలకు శక్తి లభిస్తుంది. ఆయా భాగాల్లో ఉండే నొప్పులు తగ్గుతాయి. వెన్నెముక దృఢంగా మారుతుంది. వెన్ను నొప్పి తగ్గుతుంది. పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి. పొట్ట దగ్గర, తొడలు, పిరుదుల దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. తొడలు, మోకాళ్ల వద్ద కీళ్లు దృఢంగా మారుతాయి.

సయాటికా సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. తీవ్రమైన మెడ, భుజాల నొప్పి సమస్య ఉన్నవారు, గర్భిణీలు, మోకాలి సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయరాదు.

Tags: gomukhasanaగోముఖాసనం
Previous Post

సంతాన లోపం సమస్యలు ఉన్నవారు రోజూ కచ్చితంగా ఒక గ్లాస్‌ దానిమ్మ పండు రసాన్ని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Next Post

కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు..!

Related Posts

యోగా

థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర..!

May 23, 2025
యోగా

అపాన ముద్ర వేయ‌డం ఎలా.. దీంతో క‌లిగే లాభాలు తెలుసా..?

May 22, 2025
యోగా

సూర్య‌న‌మ‌స్కారల వెన‌కున్నర‌హ‌స్యం ఏంటి.. సైన్స్ ఏం చెబుతోంది..

April 22, 2025
యోగా

5 అంటే ఐదు నిమిషాలు.. నాడీశోధన ప్రాణాయామం చేయండి.. ఎంత యాక్టివ్ గా ఉంటారో చూడండి..!

April 4, 2025
యోగా

ఈ వ్యాయామాలు చేస్తే మీ పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది..!

March 6, 2025
యోగా

పద్మాసనం ఎలా వేయాలి? ఉపయోగాలు తెలుసా..?

February 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!