అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం.. ఎలా వేయాలో తెలుసా ?

గోముఖాస‌నం వేస్తే అనేక ర‌కాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ప‌లు భాగాలు దృఢంగా మారుతాయి.

<p style&equals;"text-align&colon; justify&semi;">యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయి&period; ఒక్కో ఆసనం వేయడం వల్ల భిన్న రకాల ఫలితాలు కలుగుతాయి&period; అయితే అందరూ రోజూ అన్ని ఆసనాలను వేయలేరు&period; కనుక తమకు ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి కొన్ని వ్యాయామాలను మాత్రం రోజూ చేస్తారు&period; అలాగే అనారోగ్య సమస్యలకు అనుగుణంగా యోగా ఆసనాలను కూడా వేస్తుంటారు&period; ఈ క్రమంలోనే అలా రోజూ వేయాల్సిన ముఖ్యమైన ఆసనాల్లో ఒక ఆసనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6148 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;gomukhasana&period;jpg" alt&equals;"అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం&period;&period; ఎలా వేయాలో తెలుసా &quest;" width&equals;"1200" height&equals;"700" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం వెన్ను నొప్పితో బాధపడుతున్నవారు&comma; తొడలు&comma; కండరాలు&comma; కాళ్లు&comma; నడుం నొప్పితో బాధపడుతున్నవారు&comma; కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసేవారు రోజూ గోముఖాసనం వేయాలి&period; దీంతో అనేక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది&period; ఈ ఆసనాన్ని వేయడం కూడా చాలా సులభమే&period; అది ఎలాగంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నేలపై పద్మాసనం వేసి కూర్చోవాలి&period; తరువాత కుడి కాలును మోకాలు వద్ద వంచి దాన్ని ఎడమ తొడ మీదుగా తీసుకురావాలి&period; తరువాత కుడి పాదం ఎడమ తొడ పక్కన వచ్చేట్లు పెట్టాలి&period; అలాగే ఎడమ కాలును మోకాలు వద్ద వంచి దాన్ని కుడి కాలు తొడ కిందుగా తీసుకెళ్లాలి&period; ఎడమ కాలి పాదం కుడి కాలి పిరుదు కింద వచ్చేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్నెముకను నిటారుగా ఉంచాలి&period; కుడిచేయిని పైకి లేపి భుజం నుంచి వెనక్కి తీసుకుని తల వెనకగా పెట్టాలి&period; ఎడమ చేయిని వెనక్కి తీసుకెళ్లి కుడి చేయి వేళ్లతో ఎడమ చేయి వేళ్లను పట్టుకోవాలి&period; ఇలా వీలైనంత సేపు ఉండాలి&period; తరువాత సాధారణ స్థితికి రావాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6147 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;gomukhasana1&period;jpg" alt&equals;"అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం&period;&period; ఎలా వేయాలో తెలుసా &quest;" width&equals;"1200" height&equals;"772" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆసనాన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో చేయాలి&period; వీలైనన్ని సార్లు సౌకర్యానికి అనుగుణంగా చేయవచ్చు&period; ఈ ఆసనం వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోముఖాసనం వేయడం వల్ల తొడ కండరాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period; కాళ్ల మడమలు&comma; తొడలు&comma; భుజాలు&comma; చంకలు&comma; ఛాతి భాగాలకు శక్తి లభిస్తుంది&period; ఆయా భాగాల్లో ఉండే నొప్పులు తగ్గుతాయి&period; వెన్నెముక దృఢంగా మారుతుంది&period; వెన్ను నొప్పి తగ్గుతుంది&period; పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి&period; పొట్ట దగ్గర&comma; తొడలు&comma; పిరుదుల దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది&period; తొడలు&comma; మోకాళ్ల వద్ద కీళ్లు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సయాటికా సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది&period; తీవ్రమైన మెడ&comma; భుజాల నొప్పి సమస్య ఉన్నవారు&comma; గర్భిణీలు&comma; మోకాలి సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts