యోగా

5 అంటే ఐదు నిమిషాలు.. నాడీశోధన ప్రాణాయామం చేయండి.. ఎంత యాక్టివ్ గా ఉంటారో చూడండి..!

మానసిక ప్రశాంతత కావాలంటే శరీరంలో ఉండే వేలాది నాడులు, లక్షలాది నాడీకణాలు ఉత్తేజితం కావాలి. అన్ని నాడులు ఉత్తేజితం కావాలంటే పెద్దగా కష్టపడా ల్సిన అవసరం లేదు.

ఇంట్లోనే కూర్చొని ఐదు నిమిషాల పాటు నాడీశోధన ప్రాణాయామం చేస్తే చాలు. అయితే నాడీ శోధన ప్రాణాయామం చేసేముందు కొద్దిసేపు దండాసనం సాధన చెయ్యాలి.

this is how you can do pranayamam

అప్పుడే ఫలితాలు. మెరుగ్గా ఉంటాయి. ముందుగా. పద్మాసనంలో కూర్చొవాలి. తర్వాత నెమ్మదిగా కళ్లు మూసుకొని కుడిచేతి బొటనవేలితో కుడివైపు ముక్కు మూసి ఎడమ ముక్కు నుంచి గాలిని బయటకు వదలాలి. తర్వాత నెమ్మదిగా గాలిని పీల్చాలి. ఇప్పుడు ఎడమవైపు ముక్కును ఉంగరపు వేలితో మూసి కుడివైపు నుంచి గాలి నెమ్మదిగా వదలాలి. తిరిగి కుడివైపు నుంచి గాలిని పీల్చాలి. ఇలా ఐదు నిమిషాల పాటు చెయ్యాలి.

ఇలా చెయ్యడం వల్ల శరీరంలో ఉన్న వేలాది నాడులు ఉత్తేజితమై..మానసిక ప్రశాంతం కలుగుతుంది. అలాగే, శ్వాసక్రియ సాఫీగా సాగి… ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అదుపులో ఉంటాయి.. హర్మోన్లలో సమతుల్యత కూడా ఈ ఆసనంతో సాధ్యమవుతుంది.. అయితే, జబులు, దగ్గు ఉన్నవారు ఈ ఆసనాన్ని నిపుణుల సమక్షంలో చేస్తే మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు.

Admin

Recent Posts