వినోదం

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన రాజకుమారుడు. ప్రేక్షకుల హృదయాల‌నే కాదు హీరోయిన్ నమ్ర‌త హృదయాన్ని కూడా దోచుకొని పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ కుటుంబానికి ఒక సీనియర్ హీరోయిన్ తో అనుబంధం ఉంది.

ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు లేడీ బాస్ విజయశాంతి. కృష్ణ ఫ్యామిలీ కి లేడీ బాస్ విజయశాంతికి ఉన్న అనుబంధం ఏమిటి..? మహేష్ బాబుకు విజయశాంతి వరుసకు ఏమవుతుంది..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి అంటే సూపర్ స్టార్ కృష్ణ వివాహ జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవికి విడాకులు ఇవ్వకుండానే మొదటి భార్య అంగీకారంతో 1969లో విజయనిర్మలను ప్రేమించే వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఇందిరాదేవికి కృష్ణకు ఐదుగురు సంతానం ఉన్నారు. రమేష్ బాబు, పద్మావతి, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని. ఈ ఐదుగురు సంతానంలో మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల సినీమాల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక విజయనిర్మల విషయానికొస్తే కృష్ణతో కలిసి నటించినప్పుడు ఏర్పడిన పరిచయం ఆ తర్వాత కాలంలో ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది.

the relation between mahesh babu and vijaya shanti the relation between mahesh babu and vijaya shanti

విజయనిర్మల మొదటి భర్త అయిన కె.ఎస్. మూర్తికి విడాకులు ఇచ్చి సూపర్ స్టార్ కృష్ణ ను వివాహం చేసుకుంది. కృష్ణని వివాహం చేసుకున్న సమయానికి విజయనిర్మలకు మొదటి భర్తతో కలిగిన సంతానం నరేష్ ఉన్నాడు. రెండవ వివాహం చేసుకున్న కృష్ణ తన మొదటి భార్య ఇందిరా దేవిని కానీ, ఆయన ఐదుగురు సంతానాన్ని గాని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అదేవిధంగా విజయనిర్మల కూడా తన మొదటి భర్తకుతో కలిగిన సంతానం నరేష్ ను కూడా విడిచిపెట్టలేదు.

అసలు విషయానికి వెళితే విజయశాంతికి కృష్ణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే..? విజయనిర్మల మొదటి భర్త కె.ఎస్ మూర్తి స్వయానా చెల్లెలు విజయలలిత. ఈమె విజయనిర్మలకు స్పయాన ఆడపడుచు అవుతుంది. ఒక దశాబ్దం పాటు విజయలలిత చాలా చిత్రాల్లో నటించి అప్పటిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వారికి ఆమె గుర్తుకు రావాలి అంటే వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగరకన్య చిత్రంలో విజయలలిత మాంత్రికురాలిగా నటించింది. ఇక విజయశాంతికి విజయలలిత స్వయానా పిన్ని వరుస అవుతుంది. దీని బట్టి విజయశాంతి మహేష్ బాబుకి స్వయాన వదిన వరుస అవుతుంది.

Admin

Recent Posts