ఇంగ్లిష్ మెడిసిన్ ప్రజలకు చాలా సులభంగా అందుబాటులో ఉండడంతో ప్రజలకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సొంత వైద్యం చేసుకుంటున్నారు. తమకు తెలిసిన సమాచారంతో వివిధ రకాల మందులను కొని వేసుకుంటున్నారు. అయితే అనారోగ్య సమస్యలు తగ్గినప్పటికీ ఇంగ్లిష్ మెడిసిన్‌ను అలా వాడడం వల్ల ఎప్పటికైనా సరే సమస్యలు తప్పవు. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో, చుట్టూ పరిసరాల్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సహజసిద్ధ వైద్య విధానాలపై అవగాహన కల్పించేందుకే ఈ సైట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైద్య సమాచారం, వైద్య రంగానికి చెందిన తాజా వార్తలు, విశేషాలు, పోషకాహారం, ఇతర విలువైన సమాచారాన్ని పాఠకులకు అందించడం జరుగుతుంది. పాఠకులు ఈ సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు సహజసిద్ధమైన వైద్య విధానంపై అవగాహనను పెంపొందించుకోవచ్చు. అలాగే ఇతరులకు ఆ వివరాలను షేర్ చేయవచ్చు.