వినోదం

Mahesh Babu : మ‌హేష్ బాబుని పెళ్లి చేసుకోవ‌డానికి న‌మ్ర‌త పెట్టిన కండిష‌న్ ఏంటో తెలుసా..?

Mahesh Babu : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ వ్ కపుల్స్‌లో నమ్రత- మహేష్ బాబు జంట ఒక‌టి. వృత్తి పరంగా ఓకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకొని దాంపత్య జీవితాన్ని ఎంత‌గానో ఎంజాయ్ చేస్తున్నారు. భర్త మహేష్ బాబుకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయన విజయంలో పాలుపంచుకుంటోంది నమ్రత. వంశీ సినిమా సమయంలో తన కో- స్టార్ మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. వారి వారి స్వభావాలు కలవడంతో ప్రేమించుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట‌కి సితార‌, గౌతమ్ అనే ఇద్దరు పిల్ల‌లు ఉన్న విష‌యం తెలిసిందే.

తాజాగా న‌మ్ర‌త తన పెళ్లి దగ్గరి నుంచి నేటి వరకు జరిగిన విషయాలపై ఓపెన్ అయింది. మహేష్ బాబు నటించిన సినిమాల్లో తనకు పోకిరి సినిమా చాలా ఇష్టమని చెప్పిన నమ్రత.. తమ వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకొచ్చింది. తనకు వంట రాదని, ఆమ్లెట్, టీ, కాఫీ, మ్యాగీ వంటివి మాత్రమే చేయగలను అంటూ మొహ‌మాటం లేకుండా నమ్రత. వంట కోసం ఇంట్లో పనిమనిషి ఉంటుందని చెప్పింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదని మహేష్ ముందుగానే కండీషన్ పెట్టారని తెలిపింది.

which condition namratha put to mahesh babu for marriage

ఇక నేను కూడా ఓ కండీష‌న్ పెట్టానంటూ న‌మ్ర‌త చెప్పుకు రాగా, పెళ్లి త‌ర్వాత వెంట‌నే పెద్ద బంగ్లాకో వెళ్ల‌కూడదు అని చెప్పాను. నాకు పెద్ద బంగ్లాలలో నివసించడం చాలా భయం. ముందు అపార్ట్‌మెంట్‌లో నివ‌సించి ఆ త‌ర్వాత బంగ్లాకి వెళదాం అని చెప్పాను అంటూ న‌మ్ర‌త చెప్పుకొచ్చింది. మహేష్‌తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని చెప్పిన నమ్రత.. సితార అన్ వాటెండ్ బేబీ అని చెప్పి షాకిచ్చింది. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే మా జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమో అని కూడా ఆమె చెప్పడం విశేషం. అలాగే గౌతమ్ పుట్టిన సమయంలో ఎన్నో కష్టాలు పడ్డామని, గౌతమ్ బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారని తెలిపింది. అందరి జీవితాల్లో కొన్ని బాధలుంటాయి.. మాకు గౌతమ్ రూపంలో బాధలు వెంటాడాయి అని చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్.

Admin

Recent Posts