Memory Power : జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచే స‌ర‌స్వ‌తి ఆకు.. 40 రోజుల పాటు ఇలా తీసుకోవాలి..

Memory Power : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. జ్ఞాప‌కశ‌క్తి, ఏకాగ్ర‌త త‌గ్గిపోతున్నాయి. మాన‌సిక అనారోగ్యాలు వ‌స్తున్నాయి. కొంద‌రు పిల్ల‌ల‌కు అయితే పుట్టుక‌తోనే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు పిల్ల‌లు జ్ఞాప‌క‌శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల చ‌దువుల్లోనూ వెనుక‌బ‌డుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఈ స‌మ‌స్య‌ల‌కు చక్క‌ని ప‌రిష్కారం ఉంది. అదే స‌ర‌స్వ‌తి ఆకు. ఈ ఆకును మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధంగా ప‌రిగ‌ణిస్తారు. దీన్ని కొంత‌కాలం పాటు తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌కశ‌క్తి పెరుగుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

స‌ర‌స్వ‌తి ఆకుల‌ను కొన్నింటిని తీసుకుని నీడ‌లో ఎండ‌బెట్టాలి. అనంత‌రం వాటిని 5 బాదంప‌ప్పులు, 2 మిరియాలు, గోరు వెచ్చ‌ని నీరు పోసి మెత్త‌గా రుబ్బాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి ర‌సం తీయాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో దానికి తేనె క‌ల‌పాలి. అనంతరం ఆ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. త‌రువాత 30 నిమిషాల వ‌ర‌కు ఏమీ తీసుకోరాదు. ఇలా 40 రోజుల పాటు ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది.

use saraswati plant in this way for memory power
Memory Power

ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. దీన్ని చిన్నారుల‌కు స‌గం మోతాదులో ఇస్తే వారు చ‌దువుల్లో రాణిస్తారు. తెలివితేట‌లు పెరుగుతాయి. మాట‌లు రాని పిల్ల‌ల‌కు ఈ మిశ్ర‌మాన్ని ఇస్తుంటే నెమ్మ‌దిగా మాట‌లు వ‌స్తాయి. అలాగే న‌త్తి కూడా త‌గ్గుతుంది. ఇలా స‌ర‌స్వ‌తి మొక్క ఆకులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ మొక్క‌లు మ‌న చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల్లోనే ఉంటాయి. దీన్ని మ‌న ఇంట్లోనూ పెంచుకోవ‌చ్చు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌కు తాజా ఆకులు ల‌భిస్తాయి. వాటిని మ‌నం ఉప‌యోగించుకోవ‌చ్చు.

Editor

Recent Posts