Fold A Shirt : ఎక్కడికైనా వెళ్లాలంటే మనం బట్టల్ని రెడీగా ఉంచుకుంటే, సులభంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా బట్టలు తీసుకుని వెళ్లిపోవచ్చు. బట్టల్ని కనుక మనం సరిగ్గా సర్దుకోకపోయినా, ఫోల్డ్ చేసి పెట్టుకోకపోయినా.. అప్పటికప్పుడు బట్టల్ని మళ్లీ ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా మనం బట్టల్ని వాష్ చేసుకుని, వాటిని బాగా ఆరబెట్టుకుని, ఆ తర్వాత మంచిగా ఫోల్డ్ చేసుకుని సర్దుకోవడం మంచిది. అలా కనుక ఉంటే రెడీగా మనం ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.
బయటకు వెళ్లేటప్పుడు ఏ ఇబ్బంది కూడా ఉండదు. అయితే మీరు బట్టల్ని మడత పెట్టి పెట్టీ విసిగిపోతున్నారా..? బట్టల్ని స్పీడ్ గా మడతపెట్ట లేక సమయాన్ని వృథా చేసుకుంటున్నారా..? అయితే ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. కేవలం 2 సెకండ్లలోనే మీరు మీ టీ షర్ట్ ని ఈ విధంగా ఫోల్డ్ చేయొచ్చు. ఇలా చొక్కాని ఫోల్డ్ చేసి ఈజీగా మీ అల్మారాలో పెట్టేసుకోవచ్చు.
పైగా ఇలా ఫోల్డ్ చేయడం వలన మీకు టైం వేస్ట్ అవదు. త్వరగా మీరు బట్టలు అన్నింటినీ ఫోల్డ్ చేసేయొచ్చు. ఇలా ఈజీగా టీ షర్ట్ ని రెండే సెకండ్లలో ఫోల్డ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు మొదట ఒక బల్ల మీద మీ టీ షర్ట్ ని పెట్టుకోండి. తర్వాత భుజం భాగం నుండి కింద వరకు ఒక మడత లాగా పెట్టుకోండి.
తర్వాత సెంటర్లో కూడా ఒక మడత లాగ పెట్టుకోండి. సెంటర్ భాగాన్ని పట్టుకుని పై భాగం నుండి కింద భాగం వరకు ఫోల్డ్ చేయండి. తర్వాత సెంటర్ భాగాన్ని ముందుకి లాగి మీ చేయి తీసేయండి. ఆ తర్వాత మడతలా వచ్చేలా ఇంకో ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈజీగా రెండే రెండు సెకండ్లలో మీరు టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవచ్చు.