Home Tips

వాహ‌నాల‌ టైర్లకు నార్మల్ గాలి మంచిదా? నైట్రోజన్ మంచిదా?

<p style&equals;"text-align&colon; justify&semi;">కారు టైర్లలో నైట్రోజన్‌ను నింపితే మంచిదని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది కదా&period;&period; అందుకే చాలా పెట్రోల్ బంకుల్లో కూడా నార్మల్ గాలితో పాటు నైట్రోజన్ కూడా నింపుతున్నారు&period; అయితే కారు టైర్లలో సాధారణ గాలిని ఉపయోగించాలా లేదా నైట్రోజన్‌ను ఉపయోగించాలా అని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు&period; ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం&period; మీకు తెలుసా&quest; కారు టైర్లలో నింపే సాధారణ గాలిలో కూడా నైట్రోజన్‌ శాతం ఎక్కువగానే ఉంటుంది&period; సాధారణ గాలిలో 78&percnt; నైట్రోజన్&comma; 21&percnt; ఆక్సిజన్&comma; తక్కువ మొత్తంలో ఇతర వాయువులు ఉంటాయి&period; కారు టైరులో నైట్రోజన్ నింపితే అందులో దాదాపు 93&percnt; నుంచి 99&percnt; స్వచ్ఛమైన నైట్రోజన్‌ ఉంటుంది&period; కారు టైర్లలో ఏ గాలి నింపాలన్నది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఖర్చు&period; సాధారణ గాలి నింపాలంటే రూ&period;5&comma; రూ&period;10 ఇస్తే సరిపోతుంది&period; అదే నైట్రోజన్ నింపాలంటే రూ&period;30 నుంచి రూ&period;50 వరకు తీసుకుంటారు&period; అయితే ఒక్కసారి టైర్లలో నైట్రోజన్ నింపితే ఎక్కువ కాలం ప్రెషర్ ని పట్టి ఉంచుతుంది&period; సాధారణ గాలి అయితే తగ్గిపోతుంది&period; అందుకే తరచూ గాలి కొట్టించాల్సి వస్తుంది&period; టైర్లలో సాధారణ గాలి నింపినప్పుడు అందులో ఉండే ఆక్సిజన్ అణువులు చిన్నవిగా ఉండటం వల్ల అవి టైర్ల నుండి వేగంగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది&period; దీని కారణంగా తరచుగా టైర్ల ప్రెజర్ చెక్ చేస్తూ&comma; అవసరమైతే నింపాల్సి ఉంటుంది&period; కారు టైర్లలో నైట్రోజన్ నింపితే దాని పెద్ద అణువు పరిమాణం కారణంగా టైర్ లో ప్రెజర్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది&period; ఇది గాలి లీకేజీని తగ్గిస్తుంది&period; అంతేకాకుండా ఇంధన సామర్థ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78457 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;air-in-tires&period;jpg" alt&equals;"nitrogen or normal air which one is best for tyres " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైర్ తరుగుదల కూడా సమానంగా ఉండేలా సహకరిస్తుంది&period; టైర్లలో నైట్రోజన్ నింపితే టైర్ల జీవితకాలం పెరుగుతుంది&period; నైట్రోజన్‌లో తేమ ఉండదు కాబట్టి చక్రాలలో తుప్పు పట్టదు&period; అందువల్ల లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి&comma; బరువైన వాహనాలకు నైట్రోజన్ అయితే మంచిది&period; కార్ల టైర్లలో సాధారణ గాలి నింపితే తరచూ గాలి తగ్గిపోవడం జరుగుతుంది&period; సాధారణ గాలిలో ఉండే తేమ వల్ల కొంత కాలానికి చక్రాల అంచుల లోపల తుప్పు పడుతుంది&period; అయితే రోజూ ప్రయాణించే వారికి&comma; టైర్లను క్రమం తప్పకుండా చూసుకునే వారికి&comma; వాహనాలను శ్రద్ధగా మెయింటెయిన్ చేసేవారికి సాధారణ గాలి అయితేనే బెటర్&period; ఖర్చు కూడా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారు టైర్లలో రెండూ బాగానే పనిచేస్తాయి&period; అయితే నైట్రోజన్‌ వల్ల కాస్త ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి&period; అయిన్నప్పటికీ వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ&comma; శ్రద్ధగా చూసుకొనే వారికి సాధారణ గాలి ఉపయోగించడం మంచిది&period; నైట్రోజన్ ఎక్కువ కాలం ప్రెజర్ ని పట్టి ఉంచుతుంది&period; దీని వల్ల టైర్లు పెద్దగా దెబ్బతినవు&period; అయితే నైట్రోజన్ గ్యాస్ నింపాల్సిన ప్రతి సారి డబ్బులు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts