information

రైలు మొట్టమొదటి స్టేషన్ లో బయలుదేరటం లేట్ అయితే Pairing Rack Delay అని అనౌన్స్ చేస్తారు.దీని అర్ధం ఏమిటి?

సాధార‌ణంగా మ‌నం ఎక్కాల్సిన రైళ్లు టైముకు రావు. అవి ఎన్నో కొన్ని నిమిషాలు ఆల‌స్యంగానే న‌డుస్తుంటాయి. 5 నుంచి 10 నిమిషాలు ఆల‌స్యం అయితే ఓకే. కానీ గంటలు గంట‌లు ఆల‌స్యం అయితేనే మ‌న‌స్సు చివుక్కుమంటుంది. ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాల‌ని ప్ర‌శ్నించుకుంటాం. చాలా వ‌ర‌కు ట్రెయిన్లు ఎంతో కొంత ఆల‌స్యంగానే న‌డుస్తుంటాయి. కేవ‌లం కొన్ని ట్రెయిన్లు మాత్ర‌మే టైముకు వ‌స్తుంటాయి. అయితే ట్రెయిన్ ఆల‌స్యం అయితే మ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలిసిపోతుంది. కానీ కొన్ని సార్లు ప్ర‌త్యేక‌మైన అనౌన్స్‌మెంట్లు చేస్తారు. వాటిల్లో ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఉంది. ఇంత‌కీ అదేమిటంటే..

ఉదాహరణ ఇస్తేనే ఇది బాగా అర్థం అవుతుంది. మా ఊరిలో సాయంత్రం బయలుదేరే శేషాద్రి ఎక్సప్రెస్ మరు నాడు బెంగళూరు కి వెళ్తుంది. అది మధ్యాహ్నం బెంగళూరు వెళ్ళాక ఓ మూడు గంటల తర్వాత నాగర్ కోయిల్ కి బయలుదేరు తుంది. కాకినాడ నుండి వచ్చిన బండే నాగర్ కోయిల్ బండికి Pairing rake.

what is pairing rake delay in trains

ఎప్పుడన్నా కాకినాడ బండి లేట్ అయితే ఆటోమెటిక్ గా నాగర్ కోయిల్ బండి బయలుదేరడం లేట్ అవుతుంది.అలాగే నాగర్ కోయిల్ నుండి బెంగళూరు కి ఉదయం వచ్చిన బండే మధ్యాహ్నం కాకినాడ వెళ్లే శేషాద్రి అవుతుంది. అది లేట్ అవుతే ఇది బయలుదేరడం లేట్ అవుతుంది. వీటినే pairing rakes అంటారు. ఈ ట్రైన్ నెంబర్లు కూడా మారిపోతాయి. Accommodation కి Through బుకింగ్ కుదరదు.

Admin

Recent Posts