lifestyle

Palm Readings : చేతిలోని రేఖలు ఒకే విధంగా ఉంటే అదృష్టం కలసి వస్తుందా..?

Palm Readings : ఎన్నో వేల ఏళ్ల నాటి నుంచి హస్త సాముద్రికం (చేతి రేఖలను బట్టి జాతకం చెప్పడం) చెలామణీలో ఉంది. అయితే కొన్ని ఏళ్ల పాటు అత్యంత కూలంకషంగా అధ్యయనం చేసిన నిపుణులైన కొందరు మాత్రమే దీన్ని సరిగ్గా చెప్పగలుగుతారు. ఇప్పటి రోజుల్లో మనలో అనేక మంది హస్తసాముద్రికాన్ని కూడా నమ్ముతున్నారు. చేతిలోని రేఖల తీరుతెన్నులను బట్టి మన జాతకాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని వారి విశ్వాసం. అయితే కొందరికి ఇది అంత ఆసక్తికరమైన విషయం అనిపించకపోవచ్చు. హస్తసాముద్రికమేంటి, నాన్‌సెన్స్ అని తీసిపారేస్తారు కూడా. ఇది పక్కన పెడితే అసలు ప్రేమ, వివాహం అనే కీలక అంశాలకు చెందిన రేఖలు మాత్రం చేతిలో ఎక్కడ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలను బట్టి ప్రేమతో కూడిన అతని వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికం నైపుణ్యం కలిగిన వారు దీన్ని అత్యంత కచ్చితంగా చెప్పగలరు. ఎల్లెన్ గోల్డ్‌బర్గ్ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా హస్తసాముద్రిక శాస్ర్తాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. చేతి రేఖలను బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇప్పుడామె సాధించింది. ఆమె ఏమంటుందంటే ఒక వ్యక్తి చేతిలో ఉండే ఆయా రేఖలు అతని జీవితంలోని పలు అంశాల గురించి వివరంగా తెలుపుతాయని చెబుతోంది.

what happens if lines in palm are same

బొటనవేలు దగ్గర ప్రేమ, వాత్సల్యం, అభిమానానికి సంబంధించిన రేఖలు ఉంటాయట. ఒక వ్యక్తి ఏదైనా ఒక నిర్దిష్ట వయస్సుకు రాగానే ఆ రేఖలు కనిపిస్తాయట. అప్పుడు వారికి తగిన వ్యక్తులు జీవిత భాగస్వాములుగా దొరుకుతారట. చిటికెన వేలు కింద వివాహానికి సంబంధించిన రేఖ ఉంటుందట. రెండు చేతుల్లోనూ ఉండే ఈ రేఖలను కలిపి పక్క పక్కనే ఉంచి చూస్తే అవి సమానంగా జత కలవాలట. అలా కలిస్తే వివాహం త్వరగా అవుతుందట.

Admin

Recent Posts