వైద్య విజ్ఞానం

Blood Clot : ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌డితే ఇలా సుల‌భంగా తెలిసిపోతుంది

Blood Clot : కొన్ని పరిస్థితుల వలన కొందరికి ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గడ్డ‌ కట్టడం వంటి సమస్య ఏర్పడుతుంది. దీంతో శ‌రీర భాగాలకు కావలసిన పోష‌కాలు స‌రిగ్గా అంద‌వు. ఏదైనా గాయం తగిలినప్పుడు స‌హ‌జంగానే ఎర్ర ర‌క్త క‌ణాలు పేరుకుపోయి ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. రక్తం గడ్డకట్టడం అనే ప్రక్రియ అనేది మన జీవితానికి ఒక వరంలాంటిది. లేదంటే చిన దెబ్బ తగిలినా కూడా తీవ్ర రక్తస్రావమై మనిషి మరణించే ప్రమాదం ఉంటుంది. కానీ రక్తానికి గడ్డ కట్టే గుణం ఉంటుంది కాబట్టి, గాయం తర్వాత రక్తస్రావం ఆగిపోతుంది. రక్తం ఎప్పుడైతే గడ్డ కట్టడం ప్రారంభమవుతుందో చర్మం తనంతట తానే మరమ్మత్తు ప్రక్రియను మొదలుపెడుతుంది.

కానీ ఇదే ప్రక్రియ అంటే రక్తం గడ్డకట్టడం అన్న‌ది రక్త‌నాళాల్లో జరిగితే చాలా ప్రాణాంతక స్థితి ఏర్పడుతుంది. సిరల లోపల రక్తం గడ్డకట్టే ప్రక్రియను థ్రోంబోఎంబోలిజం అంటారు. మీరు ఈ క్రమంలో తప్పకుండా గుండె దడ సమస్యను ఎదుర్కొంటారు. ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వలన ఆక్సిజన్ సరఫరా తగ్గి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని భర్తీ చేయడానికి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇది నాడీ వ్యవస్థలో సమస్యకు దారితీస్తుంది.

blood clot will be easily known with these symptoms

రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం ద్వారా మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగదు. దాంతో మీకు మూర్ఛపోతున్నట్లు అనిపించవచ్చు. గుండెపోటు కారణంగా ఒక వ్యక్తి ఎలాంటి నొప్పి అనుభవిస్తాడో, ఊపిరితిత్తుల ఎంబోలిజం సమయంలో కూడా అదే నొప్పి సంభవిస్తుందని చెబుతున్నారు. గుండెపోటుకి ఊపిరితిత్తుల ఎంబోలిజం నొప్పికి గల వ్యత్యాసం ఏమిటంటే మీకు కత్తిపోటుకు గురైనట్లు ఉంటుంది.

మీరు దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. దగ్గు చాలా కాలం పాటు కొనసాగితే అది ఊపిరితిత్తుల ఎంబాలిజం లక్షణంలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ సమస్య ఎదురైనప్పుడు చేతులు, కాళ్లపై ఎరుపు లేదా ముదురు నీలం రంగు గుర్తులు ఉంటే సిరల లోపల రక్తం గడ్డ కట్టడం ప్రారంభం అయి ఉంటుంది అని గమనించాలి. ఈ సమస్యకు పరిష్కారంగా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఎంతో ఉత్తమం.

Admin

Recent Posts