వైద్య విజ్ఞానం

ప్రతీసారి అబార్షన్ ఎందుకు అవుతుంది…?

తల్లి కావాలి అనే కోరిక స్త్రీలు అందరికి ఉంటుంది. మాతృత్వం అనేది ఒక వరం. అందుకోసం జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉంటారు మహిళలు. జీవితంలో మాతృత్వం అనేది అందరికి ఒక వరం. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ అలా వచ్చి ఇలా పోతూ ఉంటుంది. ఎందరో స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చి పోతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

ఇలా ప్రతీసారి అబార్షన్ అవ్వడాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఈ విధంగా అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా క్రోమోజోమ్ సమస్యలు, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, ఇమ్యునలాజికల్ సమస్యలు, సెప్టేట్ యుటెరస్, హార్మోన్ సమస్యలు వీటితో పాటు థైరాయిడ్, డయాబెటీస్, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లాంటి వాటి వలన అబార్షన్ అవుతూ వస్తుంది. అదే విధంగా మగవారి వీర్య కణాల్లో నాణ్యత లేకపోయినా ఈ సమస్య ఉంటుంది.

recurrent pregnancy loss why it happens recurrent pregnancy loss why it happens

అలా కాకుండా ఆడవారిలో అండం సరిగా లేకపోయినా సరే ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే అసలు సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుని, అందుకోసం అన్ని పరీక్షలు చేయించాలి. వైద్యం అనేది తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు. నిపుణుల దగ్గరకే వెళ్ళాలి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి ఆధునిక చికిత్సలు చాలానే అందుబాటులో ఉన్నాయి.

Admin

Recent Posts