Home Made Garam Masala Podi : వంట‌ల్లో వాడే గ‌రం మ‌సాలా పొడి.. ఇలా చేస్తే సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది..!

Home Made Garam Masala Podi : మ‌నం చేసే వంట‌లు, కూర‌లు రుచిగా రావ‌డానికి వీటిలో గ‌రం మ‌సాలా పొడిని వేస్తూ ఉంటాము. గ‌రం మ‌సాలా వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌కాలు చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ మ‌సాలా వంట‌కాల్లో దీనిని మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాము. సాధార‌ణంగా ఈ గ‌రం మ‌సాలా పొడిని మ‌నం బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బ‌య‌ట నుండి కొనుగోలు చేసే ఈ గ‌రం మ‌సాలా ఘాటు త‌క్కువ‌గా ఉండ‌డంతో పాటు వాస‌న కూడా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే ఇలా బ‌య‌ట కొనే ప‌ని లేకుండా ఈ గ‌రం మ‌సాలాను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఇంట్లో చేసే ఈ గ‌రం మ‌సాలా ఘాటుతో పాటు వాస‌న కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఇలా ఇంట్లో చేసే గ‌రం మ‌సాలా వేసి చేసే కూర‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. బ‌య‌ట కొనే పని లేకుండా ఇంట్లోనే గ‌రం మ‌సాలాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గ‌రం మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్, సోంపు – ఒక టీ స్పూన్, సాజీరా – అర టీ స్పూన్, రాళ్ల ఉప్పు – అర టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, ఎండుమిర్చి – 4, దాల్చిన చెక్క – పావు క‌ప్పు, ల‌వంగాలు – 2 టేబుల్ స్పూన్స్, న‌ల్ల యాల‌కులు – 5, అనాస పువ్వులు – 4, మిరియాలు – అర టేబుల్ స్పూన్, యాల‌కులు – ఒక టేబుల్ స్పూన్.

Home Made Garam Masala Podi make like this for longer storage
Home Made Garam Masala Podi

గ‌రం మ‌సాలా పొడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ధ‌నియాలు వేసి దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత సోంపు, సాజీరా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఉప్పు వేసి చెమ్మ పోయే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి. త‌రువాత మిగిలిన మ‌సాలా దినుసులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవ‌న్నీ చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గ‌రం మ‌సాలా పొడి త‌యార‌వుతుంది. దీనిని బ‌య‌ట ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 8 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఒక సంవ‌త్స‌రం పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన గ‌రం మ‌సాలా వేసి చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts