Pooja Room : ప్రతి ఇంట్లో పూజ చేయడం సహజం. అలానే ప్రతి ఇంట నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఎన్ని రోజులకి ఒకసారి దేవుని పటాలు శుభ్రం చేయాలి.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీరు కూడా ఎన్ని రోజులు కి దేవుని పటాలు శుభ్రం చేయాలి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే తెలుసుకోండి. నెలకి ఒకసారి ఆడవారికి నెలసరి సమయం. ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి, పసుపు నీళ్లు ఇంట్లో చల్లిన తర్వాత దేవుడు పటాలని శుభ్రంగా తుడిచి, గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి అలంకరించాలి.
దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. ఫోటోలని శుభ్రం చేసేటప్పుడు, మొత్తం అన్ని ఫోటోలు తీసేసి, ఆ తర్వాత శుభ్రంగా తుడిచి, ఫోటోలన్నిటికీ బొట్టు పెట్టి తర్వాత మీరు మందిరంలో పెట్టాలి. నెలకి ఒకసారి లేదంటే వారానికి ఒక సరైనా మీరు శుభ్రపరుచుకోవచ్చు.
అలానే ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం కదా.. ఎప్పటి పువ్వులని అప్పుడే తీసేయాలి. ఈరోజు పూజ చేసాక మరుసటి రోజు పూజ చేసేటప్పుడు నిన్నటి పూలని తప్పక తీసేయాలి. పూలు ఎండి పోతే నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. చాలామంది పూలు వాడిపోలేదు కదా తాజా గానే ఉన్నాయని వదిలేస్తూ ఉంటారు. అలా చేయకండి. తీసేసిన పూలన్నింటినీ కూడా అందరూ తొక్కేసే చోట అసలు పారేయకూడదు.
ఆ పూలన్నీ పారే నదిలో కానీ పచ్చని మొక్కలు కానీ వేసేయాలి. ఇలా చేయడం వలన చెట్టుకి పోషణ లభిస్తుంది. చూడడానికి అందంగా ఉంటుంది. పాపం కూడా తగలదు. అలానే తోరణాలు ఇంటికి కట్టినప్పుడు అవి ఎండిపోకుండా తీసేయాలి. రెండు మూడు రోజుల్లోనే తీసేయడం మంచిది. శుక్రవారం నాడు తొలగించకూడదు. ముఖ్యమైన పండుగలకు, శుభకార్యాలకి గడపకి కచ్చితంగా పసుపు రాసి బొట్టు పెట్టాలి.