వినోదం

Krishna Food Habits : ఆశ్చర్యపరిచే కృష్ణ ఆహారపు అలవాట్లు.. షూటింగ్ లో వాటిని అడిగి మరీ తినేవారు..!

Krishna Food Habits : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులను అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారు తినే ఆహారం నుంచి వేసుకొని దుస్తుల వరకు అన్నీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా నటీనటులు బరువు పెరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో అలాంటివి ఏమీ లేవు.. ముఖ్యంగా కృష్ణ వంటి వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఆహారపు అలవాట్లలో కృష్ణ తీరే చాలా సపరేటుగా ఉంటుందని ఆయనతో జర్నీ చేసిన రచయితలు, కో ఆర్టిస్ట్ లు చాలామంది చెప్తూంటారు. ఇదే క్రమంలో ఆయనతో గూఢచారి 117 వంటి చాలా సినిమాలకు పనిచేసిన రచయిత తోటపల్లి మధు.. కృష్ణ ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవేంటంటే..

కృష్ణగారు చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన మాటలు గమ్మత్తుగా ఉంటాయి. మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరి టిఫిన్ వంటివి పూర్తి చేసుకుని వస్తారు. 11 గంటలకు మన పెరుగు ఆవడ వాడు రాలేదా అని అడిగేవారు. అప్పట్లో షూటింగ్ ల్లో పెరుగు ఆవడ ఇచ్చేవారు. పైన బూందీ వేసి రుచిగా ఉండేది. ఒంటిగంట లంచ్ కు ఉదయానికి మధ్య గ్యాప్ లో ఇది ఇవ్వటంతో కృష్ణగారు ఈ ఐటం కోసం అడిగేవారు. అలాగే ఒంటిగంట లంచ్ కు వెళ్లి 3 గంటలకు వచ్చేవారు. ఓ అరగంట మాట్లాడుతూ సున్నుండల వాడు రావాలే అనేవారు. వచ్చాక అవి తినేవారు. మళ్లీ ఐదున్నరకు వీట్ దోస అని వేలు మణి హోటల్ నుంచి వచ్చేది. ఇవి మద్రాస్ స్టైల్స్. అప్పటి ప్రొడ్యూసర్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేవారు. ఆయన ఎన్ని తిన్నా బ్రహ్మాండంగా ఉండేవారు. ఎక్కడా బరువు పెరిగేవారు కాదు.

do you know about these food habits of actor krishna

ఆయనది మంచి ఫిజిక్.. అద్భుతంగా ఉండేవారు అని గుర్తు చేసుకున్నారు తోటపల్లి మధు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే భోజనం రాజభోజనంలా, మధ్యాహ్న భోజనం సామాన్యుడి భోజనంలా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటు అని చెప్పేవారు ఆయన. బాలెన్స్‌డ్‌ డైట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన నీళ్లు ఎక్కువగా తాగేవారు. అందుకే ఆయన ఎప్పుడూ షూట్ లో ప్రెష్ గా ఉండేవారంటారు. ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగే వారు. మార్కెట్‌లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్‌ తీసుకునేవారు కాదు. సెట్ లో మిగతా వాళ్లు తింటున్నా.. ఆయన ఆసక్తి చూపించేవారు కాదు అని మధు గారు కృష్ణ గారి గురించి చెప్పుకొచ్చారు.

Admin

Recent Posts