వినోదం

Krishna And SP Balu : కృష్ణ సినిమాల‌కి పాటలు పాడ‌నన్న బాలు.. హిట్ కొట్టి చూపించిన సూప‌ర్ స్టార్..

Krishna And SP Balu : వివాదరహితులైన‌ బాలు, కృష్ణ‌ల‌కు ఇండస్ట్రీలో అందరితోనూ సత్సంబంధాలున్నాయి. కానీ ఒకానొక సందర్భంలో సూపర్ కృష్ణకు,బాలుకు మధ్య ఓ వివాదం తలెత్తింది.. ఆ గొడవ వల్ల మూడు సంవత్సరాలు కృష్ణ సినిమాలకు పాటలు పాడకపోవడంతో పాటు ఆయనతో కనీసం మాట్లాడలేదు బాలు. ఓ ఇంట‌ర్వ్యూలో బాలు ఈ విష‌యం గురించి తెలియ‌జేస్తూ.. ఓసారి ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందన్నారు. ఎన్నడూ కఠినంగా మాట్లాడుకోని మేము ఆరోజు పరస్పరం కాస్త నొప్పించుకునే రీతిలో మాట్లాడుకున్నట్లు చెప్పారు. అప్పటినుంచి ఆయనకు పాటలు పాడటం మానేసినట్లు తెలిపారు.

అయినప్పటికీ తాను ఎక్కడ కలిసినా కృష్ణ గారు మామూలుగానే మాట్లాడేవారని… తాను కూడా ఆయన పట్ల అంతే గౌరవంతో ఉండేవాడినని చెప్పారు. 1986లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో సింహాసనం తెరకెక్కింది. ఇది భారీ బడ్జెట్ మూవీ. కృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి సంగీతం అందించగా, ఈ మూవీలో పాటలన్నీ రాజ్ సీతారామ్-పి సుశీల పాడారు. సింహాసనం పాటలు సూప‌ర్ హిట్ కావ‌డంతో ప్రతి వేడుకలో మారుమ్రోగేవి.అయితే ఎస్పీ బాలును కాదని కృష్ణ అంత పెద్ద విజయం సాధించడం అప్పుడు హాట్ టాపిక్ అయింది.

sp balu did not sing for krishna movies for 3 years know why

ఇండ‌స్ట్రీకి రెండు పిల్ల‌ర్స్ లాంటి వారు అయిన బాలు, కృష్ణ మ‌ధ్య ఈ వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేసేందుకు … వేటూరి, రాజ్ కోటి ఇద్దరు ప్ర‌య‌త్నించారు. అయినా వివాదం సద్దుమణగలేదట. ఒక‌ రోజు బాలు.. కృష్ణ గారి దగ్గరకు వెళ్లాక… సార్ ఆరోజు నేను ఫోన్‌లో ఏం చెప్పదలుచుకున్నానో… ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను… దయచేసి నన్ను వివరించనివ్వండని ఆయనతో బాలు అన్నార‌ట‌. అయితే కృష్ణ మాత్రం… ‘ఏమండీ అవేవీ వద్దండి… ఈరోజు నుంచి ఇద్దరం కలిసి మంచిగా పని చేసుకుందాం..’ అని చెప్పారన్నారు. ఆ ఒక్క మాటతో అంతా సెటిల్ అయిపోయిందన్నారు. ఆయనేమీ అడగలేదని… ఇక తాను కూడా ఏమీ చెప్పలేదన్నారు. అలా ఆ వివాదం సమసిపోయిందట‌.

Admin

Recent Posts