వినోదం

Savithri : సావిత్రి మ‌రీ అంత స్పీడా.. అందుకే ఆమె ప‌క్క‌న కూర్చునేందుకు కూడా భ‌య‌ప‌డిపోయేవారా..?

Savithri : మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార సావిత్రి. నాట‌కాల నుండి సినిమాల వైపు అడుగులు వేసి ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎద‌రుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన సావిత్రి.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. నటనలో సావిత్రి ఏ మాత్రం తగ్గే వారు కాదు. ఏ పాత్ర అయినా సరే ఈజీగా చేసే వారు. అయితే ఒక పాత్ర ఆమెను కాదని సావిత్రికి వెళ్ళింది.

అదే మిస్సమ్మ సినిమాలోని పాత్ర. ఆ సినిమాలో భానుమతిని ఊహించుకునే కథ రాసారు. కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేసారు. కాని భానుమతి నేను చేయను అనడంతో ఆ పాత్ర సావిత్రికి వెళ్ళింది. ఆ సినిమా తర్వాత సావిత్రి ఇమేజ్ మారిపోయింది. సావిత్రిది ఎడ‌మ‌చేతి వాటం కాగా, ఆమె రాయ‌డం సంత‌కాలు చేయ‌డం ఎడ‌మ‌చేతితోనే చేసేవారు. అంతే కాకుండా కారును చాలా స్పీడుగా న‌డిపేవారు. ప‌ని విష‌యంలో సావిత్రి చాలా హార్డ్ వ‌ర్క్ చేసేవార‌ట‌. న‌ర్త‌న శాల షూటింగ్ స‌మ‌యంలో సావిత్రి 2 గంట‌ల నుండి రాత్రి 2గంట‌ల వ‌ర‌కూ షూటింగ్ లో పాల్గొనేవార‌ట‌.

do you know that savithri can drive car very quickly

షూటింగ్ త‌ర‌వాత రాత్రి డ్రైవ‌ర్ ఉన్నా కూడా సావిత్రే కారును స్పీడ్‌గా నడుపుకుంటూ వెళ్లేవారట‌. ఆమె కారు స్పీడ్ చూసి భ‌డ‌ప‌డి పోయేవార‌ట‌. చాలా వేగంగా ఆమె కారును న‌డ‌ప‌టం చూసి కారులో ఆమె ప‌క్క‌న కూర్చోడానికే వనికిపోయేవార‌ని ద‌గ్గ‌ర నుండి చూసే వారు చెప్పుకొచ్చారు. రాత్రి స‌మ‌యంలో రోడ్డు పై ఎవ‌రూ ఉండ‌ర‌ని కారును స్పీడుగా న‌డుపుతున్నారా అని అడిగితే….లేదు అవ‌కాశం ఉన్న ప్ర‌తిసారి కారును వేగంగానే న‌డుపుతాను అంటూ సావిత్రి స‌మాధానం ఇచ్చేవార‌ట‌. ఓ రోజు భ‌ర‌ణి స్టూడియోలో సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా, భ‌ర‌ణి స్టూడియో నుండి సావిత్రి ఇంటికి రావ‌డానికి డ్రైవ‌ర్ కు 40నిమిషాలు ప‌డితే సావిత్రి కేవ‌లం 20 నిమిషాల్లోనే ఇంటికి వెళ్లిపోయేద‌ట‌. ఇక ప్ర‌ముఖ ర‌చ‌యిత న‌ర్స‌రాజు ప‌దిమందిని వెంట‌పెట్టుకుని సినిమా నిర్మాణం జోలికి వెళ్ల‌ద్దు అంటూ సావిత్రిని హెచ్చ‌రించార‌ట‌. కాని విన‌కుండా నిర్మాత‌గా చేసి చేతులు కాల్చుకుంద‌ట‌.

Admin

Recent Posts