వినోదం

Bavagaru Bagunnara : బావ‌గారు బాగున్నారా సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Bavagaru Bagunnara : మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో బావ‌గారు బాగున్నారా చిత్రం ఒక‌టి. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకి నాగబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. నాగబాబు నిర్మాణంలో రూపొందిన సినిమాల‌లో ఇదొక్క‌టే మంచి విజ‌యం సాధించింది. పవన్ కళ్యాన్‌తో ఈ మెగాబ్రదర్ నిర్మించిన‘‘గుడుంబా శంకర్’’ కూడా అట్టర్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైంది. రామ్ చరణ్‌తో తీసిన ఆరెంజ్ కూడా ఈ రకంగానే డిజాస్టర్ లిస్టులో చేరింది. ఇక తాను హీరోగా నటిస్తూ.. నిర్మించిన ‘కౌరవుడు’ కూడా ఫ్లాప్ లిస్టులోనే చేరింది.

ఈ ర‌కంగా నాగ‌బాబుకి బావ‌గారు బాగున్నారా చిత్రం ఎంతో స్పెష‌ల్ అనే చెప్పాలి. 1998వ సంవత్సరంలో ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. సినిమాలో రంభ హీరోయిన్ గా నటించగా రెండవ హీరోయిన్ గా రచన నటించింది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన ప్ర‌తిపాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బ్ర‌హ్మానందం కామెడీ కూడా క‌లిసొచ్చింది.మొత్తానికి అన్నీ క‌లిసి రావ‌డంతో బావ‌గారు బాగున్నారా చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.

do you know who missed to do bavagaru bagunnara movie

అయితే ద‌ర్శ‌కుడు జ‌యంత్ ఈ సినిమా కోసం ముందు చిరంజీవిని కాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని అనుకున్నార‌ట‌. అయితే ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఈ సినిమాకి నో చెప్పార‌ట‌. దాంతో అదే క‌థ‌ని చిరంజీవి ముందు పెట్ట‌గా, ఆయ‌న ఒకే చేశారు. అలా చిరంజీవి ప్ర‌ధానపాత్ర‌లో బావ‌గారు బాగున్నారా సినిమా రూపొందింది. నాగబాబుకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

Share
Admin

Recent Posts