వినోదం

గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ పాట‌ను ఎలా చిత్రీక‌రించారో తెలుసా..?

CGI వాడకం లేని రోజుల్లో తీసిన మాయాబజార్ (1957) సినిమాలో లడ్డూలు ఎగిరినట్లు వచ్చే షాట్స్ ఇవన్నీ ఎలా చేయగలిగారు? సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే, కళా దర్శకత్వం చేసిన గోఖలే – కళాధర్ వీరిని నడిపించిన కె.వి.రెడ్డి దర్శకత్వం కలగలసి ఈ అద్భుతాలు సాధించాయి. ఇప్పుడున్న అవకాశాలు వారికి లేకపోవచ్చు కానీ అప్పటికి భారతదేశంలో అందుబాటులో ఉన్న ఏ సాంకేతికత అయినా ఉపయోగించుకోగల బడ్జెట్ వారికి ఉంది. దానికి తోడు అపారమైన సృజనాత్మకత, విపరీతమైన ఓపిక ఉంది. ఇప్పుడు అసలు ఎలా చేశారన్నది మనకు తెలిసినంతవరకూ సాంకేతిక వివరాలతో సహా చెప్పుకుందాం. వివాహ భోజనంబు పాటలో ఘటోత్కచుడు భోజనానికి ఉపక్రమించి ఒక్క లడ్డు కొరికి చూస్తాడు. ఆపైన మొత్తం లడ్డూలన్నీ ఆయన నోరు తెరవగానే నోట్లోకి వరుసగా వెళ్లిపోతాయి. ఇలా ఎగిరినట్లు ఏ రకమైన గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ఎలా కనిపించిందన్నది ఒక ఆశ్చర్యం.

కళా దర్శకులు కళాధర్ – గోఖలే కాగితంతో (పారదర్శక కాగితంతో అనుకుంటా) ఒక గరాటు (ఫన్నల్) తయారుచేయించారు. ఎస్వీ రంగారావు కూర్చుంటే ఎక్కడికి నోరు వస్తుందో చూసుకుని అక్కడికి గరాటులోంచి లడ్డూలు కిందికి వదులుతారు. గరాటులోంచి జారి ప్లేట్లో లడ్డూలు పడతాయి. దాన్ని చిత్రీకరిస్తారు. బార్‌ట్లే లైటింగ్ కూడా కొంత గరాటును కనిపించనివ్వకుండా మాయ చేసివుండాలి. అప్పుడు లడ్డూలు ఏ ఆధారం లేకుండా కిందికి పడినట్టు చిత్రీకరించవచ్చు.

do you know how this mayabazar movie scenes are made

ఇప్పుడు ఆ షాట్‌నే రివర్స్‌లో ప్లే చేశారు. వారికి కావాల్సినట్టు లడ్డూలు ప్లేట్‌లోంచి నోట్లోకి గాల్లో వెళ్తున్న దృశ్యం ఆవిష్కృతమయ్యింది. బహుశా లడ్డూలు పడడం షాట్‌లు వేరుగానూ, ఎస్వీఆర్ కూర్చోవడం నమలడం వేరుగానూ, కింద ప్లేట్లో లడ్డూలు ఖాళీ అవడం వేరుగానూ చిత్రీకరించి ఉండాలి. అప్పుడు ఆ మూడిటినీ మల్టిపుల్ ఎక్స్‌పోజింగ్ పద్ధతిలో కలిపి చేస్తే లడ్డూలు వేస్తున్నవారు కనిపించకుండా చేయవచ్చు, కింద లడ్డూలు ఖాళీ అవడం కూడా సరిగా చేయవచ్చు. నాలుగవ స్టెప్ అంచనా. మొదటి మూడు స్టెప్స్ దాదాపు కళాధర్ గుర్తుచేసుకుని పులగం చిన్నారాయణకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు.

Admin

Recent Posts