వినోదం

Vittalacharya : విఠ‌లాచార్య వంటి స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకోని ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?

Vittalacharya : 1967 సమయంలో సౌత్ ఇండియాలోనే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నటాప్ ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విఠ‌లాచార్య‌. ఉడిపి లో పుట్టిన విఠలాచార్య సినిమాలో కళ కంటే వ్యాపారమే ఎక్కువగా ఉందని నమ్మిన వ్యక్తి. ఏదైనా వ్యాపారం చేయాలని భావించి, తుండు గుడ్డ తో కర్ణాటక వచ్చి, అక్కడ సినిమా పిచ్చిని తగిలించుకొని త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. మొదట టూరింగ్ టాకీస్ బిజినెస్ చేశారు.ఆ తర్వత కొంత మంది స్నేహితులను కలుపుకొని కన్నడ సినిమాలను రిలీజ్ చేయడం మొదలెట్టారు.

ఒక దర్శకుడి తో సినిమా తీస్తుండగా, అతడు హ్యాండ్ ఇవ్వడం తో దర్శకుడిగా మారారు విఠలాచార్య. ఎలాంటి జిమ్మిక్కులు, గ్రాఫిక్స్ లేకుండా దయ్యాల సినిమాలను చేయడానికి ఆయనకు ఎవరు సాటి లేరు.ఆలా ఏకంగా 55 సినిమాలకు దర్శకత్వ వహించి జానపద బ్రహ్మ గా పేరు గడించాడు. అయితే అలాంటి స్టార్ ద‌ర్శ‌కుడితో సినిమా అంటే ఎవ‌రైన గంతులేస్తారు. కాని ఒక సందర్భంలో ఎన్టీయార్ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. విఠ‌లాచార్య త‌న సినిమాల‌కి త‌క్కువ స‌మ‌యం తీసుకుంటాడ‌నే పేరు ఉంది.

do you know why sr ntr at one time not did movies with vittalacharya

అయితే ఓ సంద‌ర్భంలో నంద‌మూరి తార‌క‌రామారావు తో ఒక సినిమా తీయాల‌ని విఠ‌లాచార్య అడ‌గ్గా కేవ‌లం వారం మాత్ర‌మే డేట్స్ ఉన్నాయ‌ని చెప్పాడ‌ట‌. దీంతో వెంట‌నే ఆ వారం రోజులు నాకు చాలు. అవి నాకు ఇచ్చేయండి సినిమా తీసి చూపిస్తానంటూ విఠ‌లాచార్య చెప్ప‌డంతో ఒక్క‌సారిగా షాక్ అయిన ఎన్టీఆర్ వారంలో ఎలా పూర్త‌వుతుంద‌ని ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. వారం రోజుల‌లో షూటింగ్ పూర్తి చేస్తారంటే తన‌కు ఏదో శాపం పెట్టి సినిమాలో పెద్ద‌గా క‌నిపించ‌కుండా చేస్తారేమోన‌ని భ‌యంతో నో చెప్పాడ‌ట‌. అలా ఎన్టీఆర్.. విఠ‌లాచార్య‌తో సినిమా చేసేందుకు నో చెప్పాడు. విఠలాచార్య ఎల్లప్పుడూ అన్నగారికి జాతక సూచనలు చేసేవారట.మొదట్లో ఎక్కువగా విఠలాచార్య సినిమాల్లో ఎన్టీఆర్ నటించేవారు. అయితే విఠలాచార్య కొన్నాళ్ళకి సినిమా ఖర్చు తగ్గించడం కోసం ఎక్కువగా కుర్ర హీరోలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు.

Admin