వినోదం

Mahesh Babu Wig : మ‌హేష్ బాబు విగ్గు పెట్టుకుంటాడా.. అస‌లు విష‌యాన్ని చెప్పేశారుగా..!

Mahesh Babu Wig : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అంద‌మైన అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్ప‌టికీ ఎంతో హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. అమ్మాయిలు అయితే త‌మ‌కి కాబోయే వ‌రుడు మ‌హేష్ బాబులా ఉండాల‌ని అనుకుంటూ ఉంటారు. అయితే మ‌హేష్ బాబుకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇన్నాళ్లు మహేష్ బాబు విగ్గు వాడుతున్నారా? లేక అది ఒరిజినల్ జుట్టేనా? అని అనుమానం చాలా మందికి ఉండ‌గా, ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్ కృష్ణకు మేకప్ మ్యాన్ గా పని చేసిన చేబ్రోలు మాధవరావు.

కృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న అనేక ఛానల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో కృష్ణ‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు మ‌హేష్ బాబు గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. కృష్ణ కు జుట్టు ఉన్నప్పటి నుంచే విగ్గు వాడేవారు అని చెప్పిన ఆయ‌న‌… ‘అసాధ్యుడు’ సినిమాకు కృష్ణ మొదటిసారిగా విగ్గు వాడారు. ఇది కృష్ణకు బాగా సెట్ కావ‌డంతో అప్పటి నుంచి అదే స్టైల్ విగ్గుతో సినిమాల్లో కనిపించారు. అయితే విగ్గు పెట్టడం వల్ల కృష్ణ జుట్టు ఊడుతూ వచ్చింది. అలా బట్టతల గా మారింది. అయినా ఏమాత్రం ఆందోళన చెందకుడా సినిమాల కోసం విగ్గు పెట్టుకునేవారు అని ఆయ‌న చెప్పారు.

is mahesh babu wears wig or what

కృష్ణ కుమారుడు మహేశ్ బాబు కూడా సినిమాల్లో విగ్గు వాడుతున్నట్లు మాధవరావు తెలిపారు. మహేశ్ బాబుకు మేకప్ మెన్ గా తన మేనల్లుడు పట్టాభి పని చేస్తున్నాడ‌ని చెప్పిన ఆయ‌న‌.. మహేశ్ బాబు తలపై పలుచటి వెంట్రుకలు ఉంటాయి. దీంతో ఆయనకు ప్రతీ సినిమాలో విగ్గు వాడాల్సి వస్తోందని పేర్కొన్నారు. అయితే నిజానికి మహేష్ బాబు ఫస్ట్ లో ఎలాంటి విగ్గులు వాడకుండానే నటించేవారు . కాని తర్వాత కాలంలో ఆయన జుట్టు రాలడం మొదలైన తర్వాత విగ్గులు వాడడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నట్లు సమాచారం. క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ అనే ఒక అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా మహేష్ తల మీద జుట్టు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న‌ట్టు కూడా ప్రచారం జ‌రిగింది.

Admin

Recent Posts