వినోదం

సూపర్ స్టార్ కృష్ణ ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..వీళ్లు అపర కుబేరులే !

1965 లో తేనె మనసులు చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ టాలీవుడ్ లో కొత్త శకం మొదలుపెట్టారు. హీరోగా కృష్ణ అందుకొని విజయాలు అంటూ లేవు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే పల్లెటూర్లలో మొత్తం బండ్లల్లో బయలుదేరేవారు గ్రామస్తులు. అంతలా పాపులారిటీ దక్కించుకున్న కృష్ణ ఆర్థికంగా కూడా అపర కుబేరుడిగా ఎదగాలి కానీ అలా జరగలేదు. డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఈ విషయాన్ని విజయనిర్మల ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు.

ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ సంపాదించిన ఆస్తుల విలువ ఎంత అంటే రూ. 300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. హైదరాబాదు, చెన్నై, బుర్రిపాలెం లో కృష్ణ పేరిట ఇల్లు కూడా ఉన్నాయి. అలాగే ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. కృష్ణ గ్యారేజ్ లో మొత్తం రూ.20 కోట్ల విలువ చేసే ఏడు కార్లు ఉన్నట్లు కూడా సమాచారం. డబ్బు విషయంలో అమాయకత్వం, సెటిల్మెంట్స్ విషయంలో మధ్యవర్తిగా ఉండడం, కీలక సమయంలో కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో కోట్లాది రూపాయలను నష్టపోయారు.

krishna assets net worth and properties value

ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించే చిత్రాలు, సీరియల్ విషయంలో కృష్ణ ఎక్కువగా తన సోదరులు హనుమంతరావు, శేషగిరి రావులపైనే ఆధారపడేవారు. అలా ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోయారు కృష్ణ. అయితే ఇవన్నీ జరగకపోయి ఉంటే ఆయన ఆస్తి సుమారుగా రూ. 500 కోట్లకు పైగా ఉండేదని అంచనా, కానీ ఈయన వారసుడు మహేష్ బాబు మాత్రం ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా ఆస్తులు కూడ‌పెట్టినట్లు సమాచారం.

Admin

Recent Posts