వినోదం

కృష్ణంరాజుకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే.. వాటి విలువ తెలిస్తే షాకవుతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఎంతో గొప్పది&period; తను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు&period; అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు&period;&period; రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు&period;&period; 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు&period; రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు&period; కృష్ణంరాజుకు ముగ్గురు కూతుర్లు&period; మరి వీరికి సంపన్న కుటుంబం కాబట్టి కృష్ణంరాజుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2009లో ఎంపీ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన కృష్ణంరాజు ఎన్నికల అఫిడవిట్ లో భాగంగా ఆయన ఆస్తులు ఇతర వివరాలను తెలియజేశారు&period;&period; 2009 వరకు కుటుంబ ఆస్తుల విలువ 8&period;62 కోట్లు&comma;2&period;14 కోట్ల అప్పులు ఉన్నాయి&period; అలాగే కృష్ణంరాజు వద్ద 5&period;28 లక్షల విలువైన బ్యాంకు డిపాజిట్లు&comma; ఆయన పేరిట ఉన్న బాండ్లు 20 లక్షలు ఉన్నాయని సమాచారం&period; అలాగే కృష్ణంరాజు పేరిట 8 లక్షల విలువైన కారు&comma; ఆరు లక్షల విలువైన మరో కారు&comma; భార్య పేరు మీద వెర్నా&comma; హుండాయ్&comma;ఐ టెన్ కార్లు కూడా ఉన్నాయని కృష్ణంరాజు పేర్కొన్నారు&period; ఇక బంగారం విషయానికి వస్తే ఆయన వద్ద 754 గ్రాముల బంగారం&comma; భార్య వద్ద 1690 గ్రాముల బంగారం&comma; ఇక వారు ముగ్గురు పిల్లల వద్ద 600&comma; 549&comma; 570 గ్రాముల చొప్పున బంగారం ఉందని&comma; 2009 లెక్కల ప్రకారం ఈ బంగారం విలువ 1&period;8 కోట్ల పైమాటే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73703 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;krishnam-raju&period;jpg" alt&equals;"krishnam raju net worth assets and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక స్థిరాస్తుల విషయంలో వస్తే కృష్ణంరాజుకు మొగల్తూరులో 9&period;50 ఎకరాలు&comma;1&period;2&comma; రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి&comma; అల్లాపూర్ లో 860 చదరపు గజాల స్థలం ఉందని పేర్కొన్నాడు&period; అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ మొత్తం 45 లక్షలు ఉంటుంది&period; అలాగే కృష్ణంరాజు పేరిట మొగల్తూరులో గాంధీ విగ్రహం సర్కిల్లో షాపింగ్ కాంప్లెక్స్&comma; ఆరు సెంట్ల భూమి&comma; ఒక ఇల్లు కూడా ఉన్నాయి&period; అప్ప‌టి ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ 42 లక్షలుగా ఉంటుందట&period; ఈ విధంగా కృష్ణంరాజు పేరిట 1&period;08 కోట్ల ఆస్తులు ఉన్నాయి&period;అలాగే కృష్ణంరాజు భార్య పేరిట గోదావరి జిల్లా టంగుటూరు మండలం చేబ్రోలులో 1&period;81&comma;0&period;34&comma;1&period;61&comma;0&period;56 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి&comma; రామన్నపాలెం లో 1&period;5&comma;0&period;30&comma;0&period;30 ఎకరాల పొలం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే 5 ఎకరాల్లో మామిడి తోట&comma; విజయవాడ సమీపం గన్నవరంలో 0&period;70 సెంట్ల భూమి&comma; హైదరాబాద్ కూకట్పల్లి అల్లాపూర్ లో 823 గజాలు&comma; 500 గజాల స్థలం ఉంది&period; జూబ్లీహిల్స్ లో 491&period;5గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు&comma; చెన్నైలోని సైదాపేట లో 3840చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి&period; అప్ప‌టి ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ ఏడు కోట్ల పై మాటే&period; అలాగే కృష్ణం రాజు కూతురు పేరు మీద శంషాబాద్లో 200 గజాల స్థలం కూడా ఉంది&period; ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం కృష్ణంరాజు కుటుంబం పేరిట మొత్తం 300 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts