ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన మొదటి పెళ్లి ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.పెళ్లి పీటలపై నాగార్జున కూర్చున్న విధానం చూస్తూ ఉంటే అచ్చం పెద్దకొడుకు నాగ చైతన్య తరహాలోనే ఉన్నట్లు అక్కినేని అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక దగ్గుబాటి లక్ష్మీ కూడా మరొక వివాహం చేసుకొని చెన్నైలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
అప్పుడప్పుడు వీరి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్ లో కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా కూడా మాట్లాడుకుంటారు. నాగచైతన్య పెళ్లిలో కూడా దగ్గుబాటి లక్ష్మీ పెళ్లి పెద్దగానే వ్యవహరించారు. ఇక నాగ చైతన్య ఒకవైపు అక్కినేని వారసుడిగా ఉంటూనే, మరొకవైపు దగ్గుబాటి మేనల్లుడిగా కూడా ఎంతో ఆప్యాయంగా పెరిగాడు.
అతనికి దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాలు కూడా నిర్మిస్తూ ఉన్నారు. నాగార్జున కూడా నాగచైతన్యతో సినిమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.