ప్రతి ఒక్కరి జీవితంలో ఊహ తెలిపి మన ఇష్ట ప్రకారం జరిగేది పెళ్లి.. ఈ పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా తల్లి కావడం అనేది దేవుడిచ్చిన వరం.. పెళ్లైన జంటల ఎవరైనా పిల్లలు పుడితే చాలా ఆనందిస్తారు.. పిల్లల్ని కనడం అనేది ఒక వరం అయితే పిల్లలు లేకుండా ఉండటం ఒక శాపం అంటుంటారు పెద్దలు.. కానీ ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనటం అనేది చాలా ఈజీ అయిపోయింది.. కొంతమంది అద్దె గర్భాలు అంటే సరోగసి.. టెస్ట్ ట్యూబ్ బేబీస్.. ద్వారా పిల్లలు కంటున్నారు.. సంతానం కలగని చాలామంది ఈ ప్రాసెస్ ద్వారానే పిల్లల్ని కంటున్నారు.. అయితే ఇందులో కొంతమంది సెలబ్రిటీస్ ఈ విధంగానే పిల్లల్ని కన్నారు వారెవరో ఓసారి చూద్దాం..
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సరోగసీ ద్వారా కవల పిల్లల్ని కన్నది.. అలాగే ఒక బిడ్డను దత్తత కూడా తీసుకుంది.. అమీర్ ఖాన్ మొదటి వివాహం చేసుకున్నా.. వీరిద్దరి విడాకుల తర్వాత మళ్లీ ఆయన కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ సరోగసి ద్వారానే కొడుకు ఆజాద్ రావ్ జన్మించారు. షారుక్ ఖాన్ -గౌరీ ఖాన్ కూడా తమ మూడవ కొడుకు అబ్రామ్ ను సరోగసీ ద్వారానే కన్నారు.
డైరెక్టర్ ఫరాఖాన్, శిరీష్ కుందర్ ల ముగ్గురు పిల్లలు సరోగసీ ద్వారా జన్మించిన వారే.. దీనికి కారణం ఫరాఖాన్ ఏజ్ పెరగడం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఈ ప్రాసెస్ ఎంచుకున్నారు. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇద్దరు పిల్లలు కూడా సరోగసీ ద్వారా పుట్టిన వారే. ఈయన సింగిల్ పేరెంట్ అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న నటి మంచు లక్ష్మి.. తన గారాలపట్టి విద్యా నిర్వాణ సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డ. తమిళ ఇండస్ట్రీలో నయనతార, విగ్నేష్ శివన్‌లు సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నారు. వీరి సరోగసి వివాదం అప్పట్లో దుమారం రేపింది.