సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను వేరే ఇతరత్ర కారణాలతో చేయకపోవడం.. ఆ సినిమాను వేరే హీరోకు కలిసి రావడం ఎప్పటి నుంచో ఉందనే విషయం మనకు తెలిసిందే.. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో కలిసి నటించగా, వెంకటేష్‌తో మాత్రం కలిసి నటించలేదు. వాస్తవానికి వెంకటేష్ హీరో అవుతానని అస్సలు అనుకోలేదట. వాళ్ల బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలని అనుకున్నారట. వెంకటేష్ హీరోగా మారడానికి సూపర్ స్టార్ కృష్ణనే కారణమట.
వెంకటేష్‌ను వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు హీరోను చేద్దామనుకోలేదు. అంతేకాదు తన ఇద్దరు కొడుకులైన సురేష్, వెంకటేష్‌లను పెద్ద బిజినెస్ మేన్‌లుగా తీర్చిదిద్దాలనుకున్నారు. ముందుగా రామానాయుడు తన పెద్ద కొడుకు సురేష్ బాబుతో ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టించారు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. దాంతో తండ్రి రామానాయుడుతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టారు సురేష్ బాబు. ఇక వెంకటేష్‌ను సైతం నిర్మాతగా లేదా వ్యాపారవేత్తగా చేద్దామనుకొని అతనితో యూఎస్‌లో ఎంబీఏ చదివించారు రామానాయుడు. కానీ వెంకటేష్ మాత్రం అనుకోకుండా.. హీరో అవ్వడం జరిగింది. ఇక వెంకటేష్ హీరోగా మారడం వెనక పెద్ద కథే నడిచింది.
సూపర్ స్టార్ కృష్ణ సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో దాదాపు కలిసి నటించారు. కానీ విక్టరీ వెంకటేష్ తో మాత్రం అస్సలు నటించలేదు. మెగాస్టార్ చిరంజీవితో కొత్త అల్లుడు, బాలకృష్ణతో సుల్తాన్, నాగార్జునతో వారసుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఒక్క త్రిమూర్తులు సినిమాలో ఓ పాటలో వెంకటేష్ తో కొన్ని సెకన్ల పాటు కనిపించారు. ప్రత్యేకంగా వీరు కలిసి నటించిన సినిమా అయితే లేదు. చిరు, బాలయ్య, నాగార్జునలతో కలిసి నటించిన కృష్ణ వెంకటేష్ తో మాత్రం కలిసి నటించలేకపోయారు. అనివార్య కారణాల వలన కృష్ణ.. వెంకటేష్ కలిసి నటించకపోగా,వారి కాంబినేషన్ రూపొందకుండా ఉండడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.