food

Left Over Rice Puri : రాత్రి మిగిలిన అన్నంతో పూరీల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Left Over Rice Puri : మ‌నం సాధార‌ణంగా గోధుమ‌పిండితో, జొన్న పిండి, రాగిపిండితో రోటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటిని అంద‌రూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా అన్నం రోటీల‌ను తిన్నారా..? అన్నం రోటీలు ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా… అవును మీరు విన్న‌ది.. నిజ‌మే. అన్నం, బియ్యంపిండితో చేసే ఈ రోటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే పూరీల వ‌లె చ‌క్క‌గా పొంగుతాయి. అంతేకాకుండా ఒక్క చుక్క నూనె వాడ‌కుండా ఈ రోటీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఈ రోటీల‌ను అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. సాధార‌ణ రోటీల వ‌లె వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మెత్త‌గా, రుచిగా ఉండే ఈ అన్నం రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నం రోటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ప‌చ్చిమిర్చి – ఒకటి, బియ్యంపిండి – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

left over rice puri here it is how to make them

అన్నం రోటి త‌యారీ విధానం..

ముందుగా జార్ లో అన్నం, ప‌చ్చిమిర్చిని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, బియ్యంపిండి వేసి క‌లుపుకోవాలి. పిండి చ‌పాతీ పిండిలా ఉండేలా చూసుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీళ్లు పోసి క‌లుపుకోవాలి. ఒక‌వేళ పిండి మరీ మెత్త‌గా ఉండే కొద్దిగా బియ్యంపిండి వేసి క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న త‌రువాత పూరీ మాదిరి చిన్న చిన్న ఉండ‌లు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి బియ్యంపిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. ఒక‌వేళ అంచులు గుండ్రంగా రాక‌పోతే వాటిని గుండ్రంగా వ‌చ్చేలా క‌ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక రోటిని వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, మెత్త‌గా ఉండే అన్నం రోటీలు త‌యార‌వుతాయి. వీటిని వెజ్, నాన్ వెజ్ ఏ కూర‌ల‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన రోటీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Admin

Recent Posts