Illia Yehfimchyk : ఈ రోజుల్లో బాడీని పెంచుకునే క్రమంలో చాలా మంది లేని పోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి మృత్యువు బారిన కూడా పడాల్సిన పరిస్థితి.ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీబిల్డర్‌గా పేరొందిన వ్యక్తి అతి చిన్న వయసులోనే కన్నుమూయడం అందరు నివ్వెరపోయేలా చేసింది. బెలారస్‌కు చెందిన బాడీ బిల్డర్ ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆరు అడుగుల ఎత్తు, భయంకరమైన శరీర ఆకృతితో ప్రసిద్ధి చెందిన యోఫిమ్ చిక్ గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలిసింది. ఇటీవల గుండెపోటుకు గురైన అతను ఆ తరువాత కోమాలోకి వెళ్లి కొద్దిరోజులకు మృతి చెందినట్లు సమాచారం.
భయంకరమైన శరీర ఆకృతితో ప్రసిద్ధి చెందిన యోఫిమ్ చిక్ గుండెపోటుకి గురై ఆ తరువాత కోమాలోకి వెళ్లి కొద్దిరోజులకు మృతి చెందినట్లు సమాచారం.తాను రోజుకు 16,500 కేలరీల ఆహారాన్ని తీసుకుంటానని, ఇందులో 2.5 కిలోల మాంసం కూడా ఉంటుందని గతంలో ఇల్లియా చెప్పాడు. 6 అడుగులకు పైగా పొడువు ఉండే అతని బరువు దాదాపు 155 కిలోలు కాగా, రోజుకు ఏడు సార్లు తింటానని చెప్పాడు.. సెప్టెంబరు 6, 2024న యెఫిమ్‌చిక్‌కి ఇంట్లోనే గుండెపోటు వచ్చిందట. కుటుంబ సభ్యులు వెంటనే అతనికి సీపీఆర్ చేసి ఆ వెంటనే విమానంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోమాలోకి వెళ్లిన యోఫిమ్ చిక్ ఇటీవలే తుదిశ్వాస విడిచినట్టుగా సమాచారం
ఈ 6-అడుగుల వ్యక్తి 340-పౌండ్ల బరువు కారణంగా బాడీబిల్డింగ్ సర్కిల్‌లలో “ది మ్యూటాంట్” అనే పేరును సంపాదించాడు. .ఇతని మాదిరిగానే బ్రిటీష్ బాడీబిల్డర్ నీల్ కర్రీ, 34, మరియు బ్రెజిలియన్ పోటీదారు ఆంటోనియో సౌజా, 26 ఏళ్ల వయస్సులో మరణించారు. 2023 సెప్టెంబరులో కర్రీ చనిపోయాడని, దీర్ఘకాలం స్టెరాయిడ్ వాడడం వలన చనిపోయినట్టు సమాచారం. ఆగస్టు 3న ఒక పోటీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన సౌజా గుండెపోటుతో మరణించడం ప్రతి ఒక్కరిని కలవరపరిచింది.