Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదేనా.. నిద్ర‌పోతే ఏమ‌వుతుంది..?

Afternoon Sleep : నిద్ర అనేది అంద‌రికి త‌ప్ప‌నిస‌రైనా జీవ‌క్రియ‌. అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క మార్పులు అనివార్యం. జీవ‌నోపాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం, రాత్రి నిద్ర‌పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది. అనేక కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా లేక ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక క‌ష్ట‌ప‌డే వారు ఎంద‌రో ఉన్నారు. మ‌న‌కు ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. కానీ నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో నిద్ర‌లేమి ఒక జ‌బ్బుగా ప‌రిణ‌మిస్తుంది. సుదీర్ఠ ప‌ని గంట‌లు, కెరీర్ ల‌క్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, దాంప‌త్య స‌మ‌స్య‌లు ఇవ‌న్నీ మాన‌సిక ఒత్తిళ్ల‌ను పెంచే అంశాలైతే గాడి త‌ప్పిన ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, అనారోగ్యాలు, మాన‌సిక స‌మ‌స్యలు ఇవి అన్నీ కూడా నిద్ర‌లేమికి దారి తీస్తున్న అంశాలు.

రోజులో ప‌ని ఒత్తిడి వల్లా కూడా చురుకుద‌నం త‌గ్గి అలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. రాత్రి ఎంత‌గా నిద్రించిన మ‌ధ్యాహ్నం వేళ చిన్న పాటి కునుకు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. హాయిగా మిట్ట మ‌ధ్యాహ్నం ఒక గంట పాటు నిద్ర‌పోతే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత కానీ తీరిక దొరికినప్పుడు కానీ కొద్ది సేపు కునుకు తీయ‌డం చూస్తూనే ఉంటాం. దీంతో శ‌రీరం పున‌రుత్తేజ‌మ‌వుతుంది. పైగా ఇలా ఒక కునుకు తీస్తే మాన‌సిక‌ప‌ర‌మైన ఒత్తిడి, శారీర‌క‌ప‌ర‌మైన ఒత్తిడి ద‌రి చేర‌వు. తాజాగా జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ప‌గ‌టి పూట నిద్ర‌పోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తి బాగా పెరుగుతుంద‌ని తేలింది. ర‌క్త‌పోటును తగ్గిస్తుంది.

Afternoon Sleep is it good for our health or not
Afternoon Sleep

గుండె ప‌నితీరును మెరుగుప‌రిచేందుకు, హార్మోన్ల హెచ్చు త‌గ్గుల‌ను స‌మం చేసేందుకు, ర‌క్త‌నాళాలు శుభ్రం చేసేందుకు ప‌గ‌టి నిద్ర ఉప‌క‌రిస్తుంది. రాత్రి ఆల‌స్యంగా నిద్రపోవ‌డం వ‌ల్ల క‌లిగే ఒత్తిడిని దీని ద్వారా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌ధ్యాహ్నం అర గంట పాటు నిద్రపోవ‌డం వ‌ల్ల ఆ త‌రువాత చేసే ప‌నిలో ఉత్సాహం నిండుతుంది. అయితే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే పురుషుల‌తో పోలిస్తే స్త్రీల‌ల్లో మ‌ధ్యాహ్నం నిద్ర వ‌ల్ల క‌లిగే లాభాలు కాస్త త‌క్కువే. కాబట్టి భోజ‌నం త‌రువాత చిన్న పాటి కునుకు తీయ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త పెరుగుతుంది.

అయితే మ‌ధ్యాహ్నం నిద్ర 30 నిమిషాలు దాటితే అది ప్రాణాల‌కే ప్ర‌మాదం. మ‌ధ్యాహ్నం భోజ‌నం తిన్న త‌రువాత 30 నిమిషాల కంటే ఎక్కువ నిద్ర‌పోయిన వారి శ‌రీరంలో మెట‌బాలిక్ సిండ్రోమ్ దెబ్బ‌తింటుంది. జీవ‌క్రియ‌లు గాఢి త‌ప్ప‌డం వ‌ల్ల న‌డుము, పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డం, ర‌క్త‌పోటు అధిక‌మ‌వ్వ‌డం, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డం వంటివి జ‌రుగుతాయని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. దీని ద్వారా గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంది. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో 30 నిమిషాల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌మాదం ఏమి లేదు.

Share
D

Recent Posts