హెల్త్ టిప్స్

కొబ్బరి బోండాంలో లేతకొబ్బరి తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

కొబ్బరిబోండాం నీటితో ఆరోగ్యం ప్రయోజనాలున్నాయని తెలుసు. మరి లోపల ఉండే లేత కొబ్బరి సంగతేంటి. చాలామంది కొబ్బరినీరు తాగి లోపల లేతకొబ్బరి తినాలంటే చూసేవాళ్లు ఏమనుకుంటారో అని ఫీలవుతారు. అసలు ఆరోగ్యం అక్కడే ఉందని బహుశా వారికి తెలిసుండకపోవచ్చు. లేదంటే ఎందుకు వదిలిపెడుతారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఈ ప్రకృతిలో అదృష్టం కొద్దీ వరంలా వచ్చిన వాటిలో కొబ్బరిబోండాం ఒకటి అని చెప్పొచ్చు. ఎండాకాలంలో కొబ్బరినీటిని మించిన ఎనర్జీ డ్రింక్ మరొకటి లేదని తెలుసు. కానీ కొబ్బరిబోండాంలో ఉన్న లేతకొబ్బరిని మాత్రం తినం. ఎందుకంటే లేత కొబ్బరిని ఏం తింటాంలే అని లైట్ తీసుకుంటాం. ఆ లేత కొబ్బరి తీసి ఇవ్వమంటే.. కొబ్బరిబోండాల షాపు వ్యక్తి ఏమనుకుంటాడో అని ఫీలవుతాం. నిజానికి ఆ లేత కొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో అద్బుత గుణాలుంటాయి. అందువల్ల మొహమటాన్ని పక్కనబెట్టి ఈ సారి బోండాం అడిగేటప్పుడు కాస్త లేతకొబ్బరి ఉన్న బోండాం కొట్టండని అడగండి. లేత కొబ్బరి ఉన్న బోండాలంలో నీరు చాలా రుచిగా, తియ్యగా ఉంటాయి. నీరు తాగాక కొబ్బరి తీయించుకొని తినండి. అది తింటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

are you eating coconut in coconuts

లేతకొబ్బరి శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. ఎండాకాలం డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. శ‌రీరానికి హాని చేసే కొలెస్ట్రాల్‌ను లేతకొబ్బరి బయటకు పంపేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిటెంట్లు ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి. బాడీలో వ్యర్థాల్ని బయటకు పంపుతాయి. పాడైన కణాల్ని రిపేర్ చేస్తాయి. లేతకొబ్బరిలో విటమిన్ ఏ, బీ, సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి. మలబద్ధకానికి సరైన ఉపశమనం లేత కొబ్బరి అని చెప్పవచ్చు.

రెండురోజులకు ఒకసారి ఈ కొబ్బరి తిన్నా చాలు. జీర్ణ సమస్యలు తొలుగుతాయి. లైంగిక శక్తిని పెంచేందుకు, స్పెర్మ్ కౌంట్ వృద్ధి చేసే గుణాలు లేతకొబ్బరిలో ఉన్నాయి. లేత కొబ్బరి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటే పచ్చి కొబ్బరి ఎక్కువగా తింటే.. దగ్గు, నిమ్ము, ఆయాసం వంటి సమస్యలొస్తాయి. అదే లేతకొబ్బరైతే.. ఓ పట్టు పట్టొచ్చు. పెద్దగా సమస్యలేవీ ఉండవు. అందువల్ల వీలు చిక్కినప్పుడల్లా లేత కొబ్బరి తినండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

Admin

Recent Posts