Mistakes : మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఆకలిని ఆపితే ఎసిడిటీతో మొదలై ఎన్నో ఇబ్బందులు వస్తాయి. పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే, మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా అంటూ ఉంటారు. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఉపవాసం సమయంలో నీరు తాగాలి. లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి కడుపులో మంట కలుగుతుంది. షుగర్ తో బాధపడే వాళ్ళు ఉపవాసం చేయకపోవడమే మంచిది.
అలానే ఎక్కువ సేపు కష్టపడి పని చేసే వాళ్ళు కూడా ఉపవాసం చేయకపోవడమే మంచిది. బలహీనంగా ఉండే వాళ్ళు కూడా ఉపవాసం చేయకూడదు. మందులు వేసుకునే వాళ్లు కూడా ఉపవాసం చేయకుండా ఉండడమే మంచిది. ఆవలింతని కూడా ఆపకూడదు. రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయి. తుమ్ము వచ్చినప్పుడు కూడా అసలు ఆపకూడదు. బలవంతంగా తెచ్చుకుని తుమ్మ కూడదు కూడా.
చాలామంది మూత్రం వస్తే కూడా మూత్రానికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దాహం వేసినా మూత్రం వస్తుందేమో అని నీళ్లు తాగడం మానేస్తారు. ఈ రెండు పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదు. అదేవిధంగా నవ్వు కూడా చాలా ముఖ్యమైనది. నవ్వినప్పుడు శరీరంలో కొన్ని రసాలు విడుదలవుతాయి. మెదడులో ప్లీనరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. అది రసాలు విడుదల చేసినప్పుడు మనకి నవ్వు వస్తుంది. దీనిని రిలీజ్ చేయడం కొన్ని సెకండ్లలోనే భావం కలగడం నవ్వు రావడం అన్నీ ఒకేసారి జరిగిపోతుంటాయి. కాబట్టి నవ్వుని కూడా ఆపడం మంచిది కాదు.
దాహాన్ని కూడా ఆపకూడదు. దాహం వేసినప్పుడు కచ్చితంగా నీళ్లు తాగాలి. ఉదయాన్నే రెండున్నర లీటర్ల వరకు నీళ్లు దాహం వేయకపోయినా తాగాలి. అప్పుడు మలినాలు పోతాయి. నీళ్లు తాగేటప్పుడు సుఖాసనంలో కూర్చుని నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది. మలవిసర్జనని కూడా ఆపకూడదు. ఉదయాన్నే రెండుసార్లు మలవిసర్జన చేయాలి. వీటిలో వేటిని కూడా బలవంతంగా ఆపకూడదు. ఆపితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే.