Foods For Kids : మీ పిల్ల‌ల‌కు రోజూ ఈ ఆహారాల‌ను తినిపించండి.. వారి మెద‌డు కంప్యూట‌ర్‌లా ప‌నిచేస్తుంది..!

Foods For Kids : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు కూడా ఒక‌టి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటేనే శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. శ‌రీరం త‌న విధుల‌ను తను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే నేటి తరుణంలో చాలా మంది పిల్ల‌ల్లో మెద‌డు ప‌నితీరు స‌రిగ్గా ఉండ‌డం లేదు. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంది. చ‌దువుపై దృష్టి పెట్ట‌డం లేదు. ఎక్కువ‌గా ఫోన్ చూడ‌డం, టీవీ చూడ‌డం, గేమ్స్ ఆడ‌డం వంటి వాటిపై శ్ర‌ద్ద చూపిస్తున్నారు. దీంతో చ‌దువులో ముందుకు వెళ్ల‌డం లేదు. చ‌దివిన విష‌యాలు కూడా మ‌ర్చిపోతూ ఉంటారు. దీని వల్ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గురరై వారిపై మ‌రింత ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఒత్తిడి కార‌ణంగా మెద‌డులో ఇన్ ప్లామేష‌న్ కు దారి తీసే సైటోకైన్స్ విడుద‌ల అయ్యి మెద‌డు ఆరోగ్యం దెబ్బ‌తింటుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్ల‌ల్లో మెద‌డు చురుకుగా, ఆరోగ్యంగా ప‌ని చేయాలంటే మ‌నం పెట్టే ఆహారంలో మార్పు చేయాల‌ని వారు చెబుతున్నారు. నేటి త‌రుణంలో చాలా మంది పిల్ల‌ల‌కు జంక్ ఫుడ్ ను, ప్రాసెస్డ్ ఫుడ్ ను, ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువ‌గా ఇస్తున్నారు. పిల్ల‌లు కూడా వీటిని తిన‌డానికే ఇష్టాన్ని చూపిస్తున్నారు. కానీ ఇలాంటి ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యంతో పాటు శ‌రీర ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పిల్ల‌లకు మెద‌డు చుర‌కుగా, ఆరోగ్యం ఉండే ఆహారాల‌ను ఇవ్వాలి. ఇలాంటి ఆహారాల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. పిల్ల‌లు కూడా చురుకుగా ఉంటారు. పిల్ల‌ల‌కు రోజూ ఒక ఉడికించిన గుడ్డును ఆహారంగా ఇవ్వాలి. గుడ్డును ఇవ్వ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం చురుకుగా ఉంటుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. పిల్ల‌ల్లో కూడా ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అలాగే పిల్ల‌ల‌కు బ్లూబెర్రీలను ఇవ్వాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.

Foods For Kids give them these for their brain health
Foods For Kids

వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. పిల్లల్లో కూడా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే పిల్ల‌ల‌కు నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో, మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. అదే విధంగా చేప‌ల‌ను ఆహారంగా ఇవ్వ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఉండే మంచి కొవ్వులు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెద‌డును చురుకుగాఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే గుమ్మ‌డి గింజ‌ల‌ను కూడా పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా ఇవ్వాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెద‌డును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డతాయి. ఈ విధంగా ఈ ఆహారాల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చ‌దువుపై దృష్టి పెట్ట‌గ‌లుగుతారు. చ‌దివిన విష‌యాలు మ‌ర్చిపోకుండా ఉంటారు.

D

Recent Posts