హెల్త్ టిప్స్

Staying In AC : ఏసీల్లో ఎక్కువ‌గా గ‌డుపుతున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Staying In AC : వేస‌విలో చ‌ల్ల‌గా ఉండేందుకు చాలా మంది కూల‌ర్లు, ఏసీల కింద ఎక్కువ‌గా గడుపుతుంటారు. కూల‌ర్లు మాట అటుంచితే ఎక్కువ శాతం మంది ఏసీల్లోనూ ఉంటారు. ఇక సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా చాలా మంది నిత్యం ఏసీల్లో ప‌నిచేస్తుంటారు. అయితే ఏసీల్లో నిత్యం ఎక్కువ‌గా గ‌డిపేవారు కొన్ని విష‌యాల ప‌ట్ల జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఆరోగ్యం ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఏసీల్లో ఎక్కువ‌గా గ‌డిపేవారికి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటి, వాటి నుంచి త‌ప్పించుకోవాలంటే ఏం చేయాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీల్లో ఎక్కువ‌గా గ‌డిపేవారికి చ‌ర్మం పొడిగా మారుతుంది. దీంతో చ‌ర్మం దుర‌ద పెడుతుంది. కొంద‌రికి ద‌ద్దుర్లు కూడా రావ‌చ్చు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే అందుకు గ‌దిలో తేమ ఉండేలా చూడాలి. దీనికి గాను హ్యుమిడిఫైర్లు ప‌నిచేస్తాయి. వీటిని గ‌దిలో పెడితే గ‌దిలో తేమ‌శాతం పెరుగుతుంది. దీంతో చ‌ర్మం పొడిగా మార‌కుండా సుర‌క్షితంగా ఉంటుంది. ఏసీల్లో ఎక్కువ‌గా ఉండేవారికి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు అధికంగా వ‌స్తుంటాయి. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా, అల‌ర్జీలు వ‌స్తుంటాయి. అయితే ఇందుకు ఏసీల్లోని ఫిల్ట‌ర్లే కార‌ణం కావ‌చ్చు. ఏసీల్లోని ఫిల్ట‌ర్ల‌కు దుమ్ము, ధూళి, బాక్టీరియా ప‌ట్టుకుని ఉంటుంది. వీటిని ఎప్పుటిక‌ప్పుడు క్లీన్ చేస్తుండాలి. దీంతో ఫిల్ట‌ర్లు శుభ్రంగా ఉంటాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

if you are spending time in ac then beware

ఏసీల్లో అధికంగా ఉండేవారికి గొంతు, క‌ళ్లు పొడిగా మారుతుంటాయి. దీంతో ద‌గ్గు వ‌స్తుంది. అలాగే క‌ళ్లు పొడిగా మారి దుర‌ద‌లు పెడుతుంటాయి. క‌నుక వీటిని అడ్డుకోవాలంటే అందుకు గాను నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. అప్పుడు గొంతు పొడి బార‌కుండా ఉంటుంది. క‌ళ్లు కూడా దుర‌ద‌లు పెట్ట‌కుండా ఉంటాయి. కొంద‌రికి ఏసీల్లో అధిక స‌మ‌యం పాటు ఉంటే నీర‌సంగా, బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. కొంద‌రికి త‌ల‌నొప్పి కూడా వ‌స్తుంది. అలాంటి వారు వీలున్నంత త‌క్కువ స‌మ‌యం ఏసీల్లో గ‌డ‌పాలి. లేదంటే స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్ర‌త‌రం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి.

ఏసీల్లో ఎక్కువ స‌మ‌యం పాటు ఉండ‌డం వ‌ల్ల కొంద‌రికి రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంద‌ట‌. అలాగే ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు ఎక్కువ‌గా వచ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ట‌. దీంతోపాటు కండ‌రాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ‌లుబు, ఫ్లూ, దీర్ఘ‌కాలిక వ్యాధులు, డీహైడ్రేషన్‌, నిద్ర‌లేమి వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. క‌నుక ఏసీల్లో వీలున్నంత త‌క్కువ స‌మ‌యం గ‌డ‌పండి. అవ‌స‌రం అయితేనే ఏసీని ఆన్ చేయండి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు అన్న విష‌యాన్ని గుర్తుంచుకోండి.

Admin

Recent Posts