Putnalu : రోజూ గుప్పెడు పుట్నాల ప‌ప్పు తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Putnalu : పుట్నాల ప‌ప్పు.. వీటినే వేయించిన శ‌న‌గ‌లు అని కూడా అంటూ ఉంటారు. పుట్నాల ప‌ప్పును స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ ర‌కాల చ‌ట్నీల త‌యారీలో, తీపి వంట‌కాల త‌యారీలో కూడా వాడుతూ ఉంటాము. పుట్నాల ప‌ప్పుతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. శ‌న‌గ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. వేగ‌న్ డైట్ చేసే వారు వీటిని తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి త‌గినంత ప్రోటీన్ ల‌భిస్తుంది. పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ చురుకుగా ప‌ని చేసేలా చేయ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది.

ప్రేగుల క‌ద‌లిక‌లను పెంచ‌డంలో, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో పుట్నాల ప‌ప్పు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో మ‌నం ఇత‌ర చిరుతిళ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోము. దీంతో మ‌నం సుల‌భంగా బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే ఆరు పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అదే విధంగా పుట్నాల పప్పులో ఫోలేట్, ఐర‌న్, ఫాస్ప‌ర‌స్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యారవుతాయి.

Putnalu in english health benefits in telugu
Putnalu

ఆస్టియో పోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా పుట్నాల ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది వీటిని నూనెలో వేయించి ఉప్పు, కారం చ‌ల్లి తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి బ‌దులుగా అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు.

D

Recent Posts