Fennel Seeds : సోంపు.. దీనిని చూస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి. సోంపు చాలా తియ్యగా ఉంటుంది. భోజనం చేసిన తరువాత సోంపు తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. వంటల్లో కూడా సోంపును విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. సోంపును చాలా మంది భోజనం చేసిన తరువాత తినే ఆహార పదార్థంగానే చూస్తారు. కానీ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేసి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగేలా చేయడంలో సోంపు చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సోంపును ఎంత ఎక్కువగా తింటే అంత త్వరగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందట. సోంపును తినడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సోంపును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తరువాత ఒక టేబుల్ స్పూన్ సోంపును తింటే నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి అసిడిటీ సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సోంపులో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. సోంపును తినడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది.
రక్తహీనత సమస్యతో బాధపడే వారు తరచూ సోంపును తినడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. సోంపును తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చర్మంపై ఉండే మొటిమలు నివారించబడతాయి. సోంపును తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువును తగ్గించడంలో సోంపు చక్కగా పని చేస్తుంది. అధిక బరువుతో బాధపడే వారు సోంపును తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. సోంపును వేయించి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి.
ఈ పొడిని గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతోపాటు అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడతారు. ఆస్తమా వంటి వ్యాధులను నివారించే గుణం కూడా సోంపుకు ఉంది. సోంపును తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. భోజనం చేసిన వెంటనే సోంపును తినడం వల్ల మలబద్దకం, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు తగ్గడమే కాకుండా మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కనుక సోంపును తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.