Health : మ‌నం రోజూ చేస్తున్న ఈ ప‌నుల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలుసా..?

Health : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్ర‌భావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మ‌న జీవ‌న శైలి, మ‌న అల‌వాట్లు, మ‌నం తీసుకునే ఆహారం ఇలా అనేక అంశాలు మ‌న ఆరోగ్యాన్ని ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. కొన్నిసార్లు మ‌నం నిర్ల‌క్ష్యం చేసే మ‌న అల‌వాట్లే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి. ఈ అల‌వాట్ల‌ను గుర్తించి వాటిని మార్చుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌నల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేసే కొన్ని విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌లో చాలా మంది ప‌నిలో ప‌డి నీటిని తాగ‌డం మ‌రిచిపోతూ ఉంటారు. దీంతో శ‌రీరంలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఇది శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్స్ అస‌మ‌తుల్య‌త‌కు దారి తీస్తుంది. డీహైడ్రేష‌న్ తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది.

త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, త‌ల‌నొప్పి వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక రోజూ 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఇక మ‌న‌లో చాలా మందిని అనారోగ్యాల పాలుచేస్తున్న వాటిలో ఒత్తిడి ఒక‌టి. నేటి త‌రుణంలో ఒత్తిడి ఒక తీవ్ర‌స‌మ‌స్య‌గా మారింది. దీర్ఘ‌కాలిక ఒత్తిడి కార‌ణంగా హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం, నిరాశ‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం జ‌రుగుతుంది. క‌నుక మ‌నం వీలైనంత వ‌ర‌కు ఒత్తిడి మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవాలి. ఇక మ‌ద్య‌పానం కూడా మ‌నల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ఎప్పుడో ఒక‌సారి మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల హాని క‌ల‌గ‌దు. కానీ రోజూ మ‌ద్యం సేవించ‌డం, అతిగా మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల మ‌నం తీవ్రఅనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది.

these common habits of ours are causing health problems
Health

క‌నుక మ‌ద్య‌పానానికి దూరంగా ఉండ‌డం చాలా మంచిది. అదేవిధంగా సెల్ ఫోన్ ల‌ను, డిజిటిల్ ప‌రిక‌రాల‌ను ఎక్కువ‌గా వాడ‌డం కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. వీటిని ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య పెరుగుతుంది. ఆందోళ‌న ఎక్కువవుతుంది. కంటి చూపు మంద‌గిస్తుంది. వివిధ ర‌కాల మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. క‌నుక వీటిని కూడా అవ‌స‌రాన్ని బ‌ట్టి వాడ‌డం మంచిది. అలాగే ఈ కాలంలో చాలా మంది నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతూ ఉంటారు. నిద్ర‌లేమి కూడా మ‌న‌ల్ని తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తుంది. నిద్ర‌లేమి కార‌ణంగా ఊబ‌కాయం, గుండె జ‌బ్బులు, మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే ఉరుకుల ప‌రుగుల జీవితం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది వ్యాయామం చేయ‌డం లేదు.

మారిన జీవ‌న విధానం కార‌ణంగా అంద‌రూ కూర్చుని చేసే ఉద్యోగాలనే ఎక్కువ‌గా చేస్తున్నారు. శారీర‌క శ్ర‌మ చేసే వారు త‌గ్గిపోతున్నారు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. క‌నుక రోజూ వ్యాయామం, జాగింగ్, సైక్లింగ్, యోగా వంటి వాటిని చేయ‌డం అల‌వాటుగా చేసుకోవాలి. ఇక ధూమ‌పానం కూడా మ‌న‌ల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ధూమ‌పానం కార‌ణంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు, గుండె జ‌బ్బులు, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ధూమ‌పానానికి కూడా దూరంగా ఉండ‌డం చాలా మంచిది. ఇక మారిన జీవ‌న విధానం కార‌ణంగా చాలా మందికి క‌నీసం సూర్య‌కాంతి కూడా త‌గ‌ల‌డం లేదు. దీంతో విట‌మిన్ డి లోపంతో పాటు శ‌రీరంలో రోగ‌నిరోధ‌ఖ శ‌క్తి కూడా తగ్గుతుంది. క‌నుక రోజూ శ‌రీరానికి సూర్య‌కాంతి త‌గిలేలా చూసుకోవాలి.

D

Recent Posts