హెల్త్ టిప్స్

పిల్లల్ని క‌నేందుకు స్త్రీ, పురుషుల‌కు స‌రైన వ‌య‌స్సు ఏమిటో తెలుసా..?

నేటి త‌రుణంలో కొత్త‌గా పెళ్ల‌య్యే దంప‌తులు ఎవ‌రైనా స‌రే.. పిల్ల‌ల్ని క‌న‌డానికి అప్పుడే తొంద‌రేముంది ? జాబ్ లో ఇంకా ఉన్న‌త స్థానానికి వెళ్లాలి. మంచి ఇల్లు క‌ట్టుకోవాలి. కాస్తంత డ‌బ్బు వెన‌కేయాలి. ఆ త‌రువాతే.. తీరిగ్గా పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చులే. అయినా నేడు ఆధునిక వైద్య ప‌రిజ్ఞానం మ‌న‌కు అందుబాటులో ఉందిగా.. దాంతో ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చు.. అందుకు దిగులెందుకు.. అని అనుకుంటున్నారు. కానీ అస‌లు 30, 35 ఏళ్ల త‌రువాత పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చా, అందుకు సంభావ్య‌త ఉంటుందా, ఏ వ‌య‌స్సులో పిల్ల‌ల్ని కంటే మంచిది ? అన్న విష‌యాల‌ను వారు తెలుసుకోలేక‌పోతున్నారు. దీంతో చాలా మందికి పిల్ల‌లు క‌ల‌గడం లేదు. అయితే అస‌లు నిజానికి ఏ వ‌య‌స్సులో పిల్ల‌ల్ని కంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందామా..!

పిల్ల‌ల్ని క‌నేందుకు స్త్రీకైనా, పురుషుడికైనా 25 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ వ‌య‌స్సు లోపు అయితేనే పురుషుడిలో వీర్య క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంటాయి. వాటి క‌ద‌లిక కూడా బాగుంటుంది. ఇక స్త్రీల‌లో నెల‌స‌రి స‌రిగ్గా వ‌స్తుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి. అయితే ఇద్ద‌రికీ 25 నుంచి 28 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్నా ఫ‌ర్వాలేదు. కానీ 30 సంవ‌త్స‌రాలు దాటితేనే సంతానం క‌లిగే అవ‌కాశాలు బాగా త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

30 సంవ‌త్స‌రాలు దాటిన స్త్రీలకు సంతానం క‌లిగే అవ‌కాశం త‌గ్గుతూ వ‌స్తుంద‌ట‌. ఇక ఆ వ‌య‌స్సు దాటిన పురుషుల్లో అయితే వీర్య క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గుతుంద‌ట‌. దీనికి తోడు ఆ క‌ణాల క‌ద‌లిక కూడా క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంద‌ట‌. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ఒక రీసెర్చి ప్ర‌కారం అయితే 40 ఏళ్ల‌కు పైబ‌డిన భాగ‌స్వాములున్న స్త్రీలలో గ‌ర్భ‌ధార‌ణ‌కు కొంచెం ఎక్కువ స‌మ‌యం ప‌డుతున్న‌ద‌ట‌. అలాగే 25 ఏళ్ల వ‌య‌స్సు ప్రాంతంలో భాగ‌స్వాములున్న స్త్రీలు త్వ‌ర‌గా గ‌ర్భ‌వ‌తులవుతున్నార‌ని తెలిసింది.

what is the best age for men and women to have kids

అలాగే పురుషులకు 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు దాటితే వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఏడాదికి 1 శాతం చొప్పున త‌గ్గుతాయ‌ట‌. అది వీర్య క‌ణాల ఉత్ప‌త్తిపై ప్ర‌భావం చూపుతుంద‌ట‌. ఇక వీర్యం నాణ్య‌త విష‌యానికి వ‌స్తే 35 ఏళ్లు దాటాక దాని నాణ్య‌త త‌గ్గుతుంద‌ట‌. వ‌య‌స్సు పైబ‌డుతున్న కొద్దీ వీర్య క‌ణాల ఉత్ప‌త్తి, వాటి క‌ద‌లిక త‌గ్గుతాయ‌ట‌. 25 ఏళ్ల‌కు ముందు వ‌య‌స్సున్న వారిలో ఉండే వీర్య క‌ణాల ఉత్ప‌త్తి, క‌ద‌లిక‌, 55 ఏళ్ల త‌రువాత 50 శాతానికి పైగా ప‌డిపోతుంద‌ట‌. అలాగే పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, పోష‌కాహార లోపం, బిగుతైన దుస్తులు ధ‌రించ‌డం, నిద్ర‌లేమి వంటివి ఉంటే పురుషుల్లో సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం న‌శిస్తుంద‌ట‌.

క‌నుక ఏ వ్య‌క్తికైనా తండ్రి అయ్యేందుకు, పిల్లల్ని క‌నేందుకు 22 నుంచి 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు స‌రైంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో అంత త‌క్కువ వ‌య‌స్సులో పెళ్లి కావ‌డం అరుదుగానే జ‌రుగుతుంది. కానీ అలాంటి వారు క‌నీసం 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపు అయినా పెళ్లి చేసుకోగ‌లిగితే మంచిది. త‌ద్వారా సంతానాన్ని త్వ‌ర‌గా పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక 35 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు దాటాక అయితే వ్య‌క్తుల్లో డీఎన్ఏలోనూ మార్పులు వ‌స్తాయ‌ట‌. క‌నుక‌.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 30 లోపు పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని క‌నేయాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Admin

Recent Posts