Jal Jeera Powder : జీర్ణాశ‌యాన్ని ఆరోగ్యంగా ఉంచే.. హెల్దీ డ్రింక్‌.. తయారీ ఇలా..!

Jal Jeera Powder : కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌తో పాటు కొన్ని ర‌కాల పానీయాలు కూడా మ‌న‌కు త‌క్ష‌ణ శ‌క్తిని, చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇలా మ‌న‌కు ఆరోగ్యాన్ని, శ‌క్తిని వాటిల్లో జ‌ల్ జీరా పొడితో చేసే పానీయాలు ఒక‌టి. జ‌ల్ జీరా పొడిని ఉప‌యోగించి చేసే పానీయాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సంతో పాటు ప‌లు ర‌కాల జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ జ‌ల్ జీరా పొడిని.. అలాగే దీనితో పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జ‌ల్ జీరా పౌడ‌ర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, శొంఠి – అర ఇంచు ముక్క‌, మిరియాలు – పావు టీ స్పూన్, ఆమ్ చూర్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా పొడి – ఒక టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పంచ‌దార పొడి – 2 టేబుల్ స్పూన్స్.

Jal Jeera Powder healthy drink of digestive system
Jal Jeera Powder

జ‌ల్ జీరా డ్రింక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన నిమ్మ‌కాయ ముక్క – 1, అల్లం ముక్క – ఒక ఇంచు ముక్క‌, పుదీనా ఆకులు – ఒక టేబుల్ స్పూన్, జ‌ల్ జీరా పొడి – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, పంచ‌దార పొడి – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, సోడా – 200 ఎమ్ ఎల్.
జ‌ల్ జీరా పౌడ‌ర్ తయారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో జీల‌క‌ర్ర‌, శొంఠి ముక్క‌లు, మిరియాలు వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా క‌లుపుతూ 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇప్పుడు వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌ల్ జీరా పౌడ‌ర్ త‌యార‌వుతుంది. దీనిని ఒక గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 6 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ‌ల్ జీరా పౌడ‌ర్ తో డ్రింక్ ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం.

దీని కోసం ఒక రోట్లో నిమ్మ‌కాయ ముక్క‌, అల్లం ముక్క‌, పుదీనా ఆకులు వేసి క‌చ్చాప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ లో జ‌ల్ జీరా పొడి, పంచ‌దార పొడి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత సోడాను పోసి క‌ల‌పాలి. ఇలా చేక‌య‌డం వ‌ల్ల డ్రింక్ త‌యార‌వుతుంది. ఇందులో ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవ‌చ్చు. ఇలా జ‌ల్ జీరా పొడితో డ్రింక్ ను త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌ప‌డుతుంది. అలాగే త‌క్ష‌ణ శ‌క్తి కూడా ల‌భిస్తుంది. ఇదే కాకుండా జ‌ల్ జీరా పొడితో వివిద ర‌కాల డ్రింక్ ల‌ను కూడా త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts