Weight Loss : అధిక బరువు కారణంగా బాదపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. అధిక బరువు బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. మారుతున్న జీవన విధానం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి వాటిని అధిక బరువుకు కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈ అధిక బరువు కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా మంది బరువు తగ్గరు. సహజ సిద్ధంగా మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఒక డ్రింక్ ను చేసుకుని తాగడం వల్ల చాలా త్వరగా మనం బరువు తగ్గవచ్చు.
ఈ డ్రింక్ ను తయారు చేయడంలో ముఖ్యంగా మనం జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. జీలకర్ర ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. వంటల తయారీలో, పచ్చళ్ల తయారీలో దీనిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జీలకర్రను వంటల్లో వాడడం వల్ల రుచితోపాటు మనం ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రను ఉపయోగించి బరువు తగ్గే డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం జీలకర్రను ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ప్రతి రోజూ ఈ నీటిని తాగడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. మరొక విధంగా కూడా జీలకర్రను ఉపయోగించి మనం బరువు తగ్గవచ్చు. ఒకటిన్నర గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఈ కషాయం గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
ఈ విధంగా జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో జీలకర్రను వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. జీలకర్ర నీటిని తాగలేని వారు తినే ఆహార పదార్థాల మీద జీలకర్ర పొడిని చల్లుకుని తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. జీలకర్రతో చేసిన కషాయాన్ని తాగడం కంటే జీలకర్ర పొడి వేసి తయారు చేసిన డ్రింక్ ను తాగడం వల్ల మనం అధిక ఫలితాన్ని పొందవచ్చు. ఇంకా త్వరగా బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర పొడిని వేసి చేసే ఈ డ్రింక్ లో దాల్చిన చెక్క పొడిని, తేనెను కలుపుకుని తాగాలి.
ఇలా చేయడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గడంతోపాటు అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా జీలకర్రను ఉపయోగించడం వల్ల మనం చాలా సులభంగా, చాలా త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.