Ear Wax Cleaning : ఇలా చేస్తే.. 2 నిమిషాల్లో మీ చెవిలో ఉండే గులిమి మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది..

Ear Wax Cleaning : మ‌న శ‌రీరంలో ఉండే సున్నిత‌మైన భాగాల్లో చెవిలో ఉండే అంత‌ర్భాగం కూడా ఒక‌టి. చెవిలో ఎన్నో ర‌కాల నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే చాలా ప్రమాదం. చెవి విన‌బ‌డ‌కుండా పోవ‌డ‌మో, ఇన్ఫెక్ష‌న్ లు రావ‌డ‌మో, ఇత‌ర చెవి సంబంధింత అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డ‌మో జ‌రుగుతూ ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది చెవుల‌ను ఇయ‌ర్ బ‌డ్స్ తో శుభ్రం చేసుకుంటున్నారు. కానీ ఇలా కాట‌న్ ఇయ‌ర్ బ‌డ్స్ ను వాడ‌డం చెవికి చాలా హానిని క‌లిగిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చెవిని ఇయ‌ర్ బ‌డ్స్ తో శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల ఏటా ఇంగ్లాడ్ లో ఏడు వేల మంది చెవికి సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నార‌ట‌. వీటిని వాడ‌డం వల్ల చెవిలోని అంత‌ర్గ‌త భాగాలు దెబ్బ‌తింటున్నాయ‌ని నిపుణులు అంటున్నారు.

చెవిలోని గులిమి తీయ‌డానికి కాట‌న్ బ‌డ్ ను పెడితే అది గుమిలిని మ‌రింత లోపలికి నెడుతుంద‌ట‌. దీని వ‌ల్ల అడ్డంకులు ఏర్ప‌డి వినికిడి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. చెవిలో గులిమి ఏర్ప‌డ‌డం స‌హ‌జ‌సిద్ద‌మైన ప్ర‌క్రియ. చెవిలోని కొన్ని గ్రంథులు గులిమిని స్ర‌విస్తాయ‌ట‌. ఇది సాధార‌ణ స్థాయిలో ఉంటే మ‌న‌కు ఎటువంటి అనారోగ్యం క‌ల‌గ‌ద‌ట‌. గులిమిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయ‌ట‌. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు స‌హాక‌రిస్తాయ‌ట‌. చెవిలో త‌యార‌య్యే గులిమి కొన్ని రోజుల‌కు దానంత‌ట అదే పోతుంద‌ట‌. దానిని తీయ‌డానికి ఎటువంటి కాట‌న్ బ‌డ్స్ ను ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేద‌ట‌.

Ear Wax Cleaning follow these natural home remedies
Ear Wax Cleaning

కొంత‌మందిలో మాత్ర‌మే గులిమి ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. ఇలా గులిమి ఎక్కువ‌గా త‌యార‌య్యే వారు కాట‌న్ బ‌డ్స్ ను వాడే ప‌ని లేకుండా కొన్ని స‌హ‌జ‌ప‌ద్ద‌తుల‌ను ఉప‌యోగించి చెవుల‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు. చెవుల‌ను శుభ్రం చేసుకునే స‌హ‌జ ప‌ద్ద‌తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం అర క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ నీటిలో దూదిని ఉంచి నాన‌బెట్టాలి. త‌రువాత ఈ దూదిని తీసి స‌మ‌స్య ఉన్న చెవి పైవైపుకు వ‌చ్చేలా త‌ల‌ను ఒక‌వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి. అందులో నుండి కొంత ద్ర‌వం చుక్క‌లు చుక్క‌లుగా చెవిలో ప‌డుతుంది.

త‌రువాత చెవిని మూడు నుండి ఐదు నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి. కొంత స‌మ‌యం త‌రువాత త‌ల‌ను మ‌రో వైపుకు వంచితే మ‌రో చెవి నుండి నీరు బ‌య‌ట‌కు వ‌స్తుంది. త‌రువాత చెవుల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేస్తే చెవిలో గులిమి పోతుంది. ఉప్పు ద్రవ‌ణాన్నే కాకుండా దాని స్థానంలో బేబి ఆయిల్ ను, మిన‌ర‌ల్ ఆయిల్ ను కూడా వాడుకోవ‌చ్చు. అలాగే చెవిలో గులిమిని తొల‌గించ‌డంలో వేడి నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బ‌రి నూనెను తీసుకుని గోరు వెచ్చ‌గా వేడి చేయాలి. త‌రువాత ఈ నూనెను మూడు నుండి నాలుగు చుక్క‌ల మోతాదులో చెవిలో వేసుకోవాలి.

ఇది ఒక ద్రావ‌కం లా ప‌ని చేస్తుంది. వెచ్చ‌ని నూనె గులిమిని క‌రిగేలా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు చెవిలో నూనె వేసి దూది పెట్టుకుని నూనె వేసిన చెవి పైకి వ‌చ్చేలా త‌ల‌ను ఉంచి ప‌డుకోవాలి. మ‌రుస‌టి రోజు చెవిలో ఉన్న అద‌న‌పు నూనెను తొల‌గించ‌డానికి చెవిలో నీటిని వేయాలి. నీళ్లు వేసి చెవిని ప‌క్క‌కు వంచితే నీళ్ల‌తో పాటు నూనె, గులిమి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. ఈ చిట్కాను పాటించిన కూడా గులిమి తొల‌గ‌క‌పోతే వైద్యున్ని సంప్ర‌దించాలి. వైద్యులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ప‌రిక‌రాలతో నొప్పి లేకుండా చెవి నుండి గులిమిని తొల‌గిస్తారు. చెవుల‌కు అన్నీ ఇత‌ర అవ‌య‌వాల‌తో పాటు స‌మాన ప్రాధాన్య‌త ఇవ్వాలి.

D

Recent Posts