Eye Sight Home Remedy : ఒక చక్కటి పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల మన కంటి సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే ఈ పొడిని తయారు చేసుకోవడం వాడడం కూడా చాలా సులభం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. కంటి చూపు మందగించడం, కళ్ల నుండి నీరు కారడం, కళ్లు ఎర్రబడడం, కళ్లు మసకగా కనబడడం, కళ్లు పొడి బారడం, కంటిలో దురదలు ఇలా కంటి సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మందే ఉంటారు.
సెల్ ఫోన్ లను, ల్యాప్ టాప్ లను ఎక్కువగా వాడడం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ పొడిని వాడడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల కళ్లద్దాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ పొడిని చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా ఉపయోగించవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ మనం 10 గ్రాముల తెల్ల మిరియాలను, 50 గ్రాముల సోంపు గింజలను, 50 గ్రాముల బాదం పప్పును, 100 గ్రాముల పటిక బెల్లాన్ని, 10 గ్రాముల యాలకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పటిక బెల్లాన్ని పొడిగా చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలిపి పాలను తాగాలి. ఇలా తాగడం ఇష్టంలేని వారు పొడిని తిని పాలను తాగాలి. అలాగే పిల్లలకు ఉదయం అల్పాహారం తిన్న తరువాత పాలల్లో కలిపి తాగించాలి. ఇలా ఈ పొడిని నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల కంటి సమస్యలన్నీ దూరమవుతాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.