Flaxseeds Powder With Curd : పెరుగులో వీటిని క‌లిపి తింటే చాలు.. కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, రక్తనాళాల్లో బ్లాకేజ్ పోతాయి..!

Flaxseeds Powder With Curd : ఒక చ‌క్క‌టి చిట్కాను మ‌న ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం తలెత్త‌కుండా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల మ‌ధ్య‌ గుజ్జు పెరుగుతుంది. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. అలాగే దీనిని వాడ‌డం కూడా చాలా సుల‌భం. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి..ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం పెరుగును, అవిసె గింజ‌ల పొడిని, ప‌టిక బెల్లం పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా క‌ళాయిలో అవిసె గింజల‌ను వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అర క‌ప్పు పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో రెండు టీ స్పూన్ల అవిసె గింజల పొడిని వేసి క‌ల‌పాలి. డ‌యాబెటిస్ లేని వారు ఇందులో అర టీ స్పూన్ ప‌టిక బెల్లం పొడిని వేసి క‌లిపి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజుకు ఒక‌సారి తీసుకోవాలి. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అయితే దీనిని భోజ‌నానికి 10 నిమిషాల ముందు తీసుకోవాలి. అదే బ‌రువు త‌క్కువ‌గా ఉండే వారు అయితే భోజ‌నం చేసిన 10 నిమిషాల త‌రువాత తీసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు శుభ్ర‌ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. ఈ విధంగా ఈ చిట్కాను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది.

Flaxseeds Powder With Curd take them daily for benefits
Flaxseeds Powder With Curd

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జీర్ణశ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను రోజూ ఉద‌యం పాటించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొట్ట పూర్తిగా శుభ్ర‌ప‌డుతుంది. పెరుగు, అవిసె గింజ‌ల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం తీసుకున్న ఆహారంలో ఉండే పోష‌కాలు శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు, ఫ్రీ రాడిక‌ల్స్ అన్నీ తొల‌గిపోతాయి. శ‌రీరంలో వాతం పెరిగిపోవ‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. న‌రాల బ‌ల‌హీన‌త‌, తిమ్మిర్ల స‌మ‌స్య‌తో బాధ‌పడే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. ఈ విధంగా అవిసె గింజ‌ల‌ను, పెరుగును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts